తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi : 18 నెలలు- 10లక్షల ఉద్యోగాలు.. ఇదీ మోదీ 'మిషన్​'!

PM Modi : 18 నెలలు- 10లక్షల ఉద్యోగాలు.. ఇదీ మోదీ 'మిషన్​'!

Sharath Chitturi HT Telugu

14 June 2022, 13:29 IST

    • PM Modi : రానున్న 1.5ఏళ్లల్లో 10లక్షల మందిని నియమించుకోవాలని వివిధ విభాగాలు, మంత్రిత్వశాఖలకు ఆదేశాలు అందాయి. స్వయంగా ప్రధాని మోదీ ఈ ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది.
18 నెలలు- 10లక్షల ఉద్యోగాలు.. గేర్​ మార్చిన మోదీ ప్రభుత్వం!
18 నెలలు- 10లక్షల ఉద్యోగాలు.. గేర్​ మార్చిన మోదీ ప్రభుత్వం! (HT_PRINT)

18 నెలలు- 10లక్షల ఉద్యోగాలు.. గేర్​ మార్చిన మోదీ ప్రభుత్వం!

PM Modi : రానున్న 18 నెలల్లో.. 10లక్షల మందిని నియమించుకోవాలని వివిధ ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వశాఖలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం మంగళవారం వెల్లడించింది. నియామకాల ప్రక్రియను ఒక మిషన్​గా చేపట్టాలని ప్రధాని సూచించినట్టు స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

Uber ride horror: కారులో ఉబర్ డ్రైవర్ హస్తప్రయోగం; భయాందోళనలకు గురైన మహిళ

వివిధ విభాగాలు, మంత్రిత్వశాఖల్లో మానవ వనరుల విషయంపై సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రధాని మోదీ ఈ ఆదేశాలిచ్చినట్టు.. ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.

"దేశంలోని మంత్రిత్వశాఖలు, డిపార్ట్​మెంట్స్​లోని మానవ వరుల అంశాన్ని ప్రధాని సమీక్షించారుు. రానున్న 1.5ఏళ్లల్లో.. 10లక్షల మందిని నియమించుకోవాలని ఆదేశించారు," అని పీఎంఓ ట్వీట్​ చేసింది.

దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు గత కొన్నేళ్లుగా మండిపడుతున్నాయి. ఈ క్రమంలో మోదీ ఆదేశాలు వార్తల్లో నిలిచాయి. నిరుద్యోగులకు ఇది కచ్చితంగా శుభవార్తే!

తదుపరి వ్యాసం