తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bihar Women's Panel Chief Chides Students| ‘రేపు కాండోమ్స్ కూడా అడుగుతారు’

Bihar women's panel chief chides students| ‘రేపు కాండోమ్స్ కూడా అడుగుతారు’

HT Telugu Desk HT Telugu

28 September 2022, 19:02 IST

    • Bihar women's panel chief chides students| పాఠశాలలో సానిటరీ ప్యాడ్స్ ను ఉచితంగా అందుబాటులో ఉంచాలన్న విద్యార్థినుల అభ్యర్థనపై ఈ ఐఏఎస్ అధికారి ఇలా స్పందించారు.
ఐఏఎస్ అధికారి హర్జోత్ కౌర్
ఐఏఎస్ అధికారి హర్జోత్ కౌర్

ఐఏఎస్ అధికారి హర్జోత్ కౌర్

Bihar women's panel chief chides students| ఈ ఐఏఎస్ అధికారి పేరు హర్జోత్ కౌర్. బిహార్ మహిళా అభివ‌ృద్ధి కార్పొరేషన్(Bihar Women Development Corporation) కు మేనేజింగ్ డైరెక్టర్. ఈమె ఒక పాఠశాలకు వచ్చినప్పుడు జరిగిన ఘటన ఇది.

ట్రెండింగ్ వార్తలు

Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

Bihar women's panel chief chides students| న్యాప్కిన్స్ ఇవ్వాలన్న అభ్యర్థనపై..

బిహార్లో తమ పాఠశాలకు వచ్చిన బిహార్ విమన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి హర్జోత్ కౌర్ కు అక్కడి విద్యార్థినులు నెలసరి సమయంలో ఇబ్బంది అవుతోందని, సానిటరీ న్యాప్కిన్స్ ను ఉచితంగా అందించేలా చూడాలని అభ్యర్థించారు. ‘ప్రభుత్వం ఎంతో మందికి ఎన్నో ఉచితంగా ఇస్తోంది కదా, మా ఈ చిన్న కోరిక తీర్చలేరా? ’ అని అడిగారు.

Bihar women's panel chief chides students| కాండోమ్స్ కూడా అడుగుతారు..

ఈ అభ్యర్థన పై ఆ అధికారి దారుణంగా స్పందించారు. ఆ విద్యార్థినులను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉచితంగా సానిటరీ న్యాప్కిన్లను అడుగుతున్నారు. కొన్ని రోజులయ్యాక కాండోమ్స్ ను కూడా ఉచితంగా ఇవ్వమని అడుగుతారు’ అని ఆ విద్యార్థినులను దారుణంగా అవమానించారు.

Bihar women's panel chief chides students| పాకిస్తాన్ కు పొండి..

‘ప్రభుత్వం మాకు రూ. 20 ల ప్యాడ్స్ ఉచితంగా ఇవ్వలేదా? ఇది ఆరోగ్యానికి అవసరమైన విషయమే కదా? అన్న విద్యార్థిని ప్రశ్నకు ఆ అధికారి దురుసుగా జవాబిచ్చారు. ‘మీ కోరికలకు అంతు లేదా? రేపు ఉచితంగా జీన్స్ ఇవ్వాలంటారు. షూస్ ఉచితంగా ఇవ్వాలంటారు. చివరకు కాండోమ్స్ ను కూడా ఫ్రీ ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ప్రభుత్వం ఇవన్నీ మీకు ఎందుకు ఇవ్వాలి?. ఇలాంటి ఆలోచన మంచిది కాదు’’ అంటూ మండిపడ్డారు. ఆ అధికారి వ్యాఖ్యలకు స్పందిస్తూ.. ఒక విద్యార్థిని.. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తుంటారు కదా అంటూ గుర్తు చేయగా.. ‘ మీరు ఓటు వేయకండి. పాకిస్తాన్ కు వెళ్లిపోండి’ అంటూ అర్థం లేకుండా మాట్లాడారు ఆ ఐఏఎస్ అధికారి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

తదుపరి వ్యాసం