తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nayanthara Surrogacy Row: నయనతార సరోగసి వివాదంలో కొత్త మలుపు

Nayanthara Surrogacy row: నయనతార సరోగసి వివాదంలో కొత్త మలుపు

HT Telugu Desk HT Telugu

11 October 2022, 19:10 IST

google News
  • Nayanthara Surrogacy row: కవల పిల్లలకు తల్లి అయిన ఆనందం హీరోయిన్ నయనతారకు కాసేపు కూడా లేకుండా పోయింది. ఆమె అద్దె గర్భంతో కవల పిల్లలకు జన్మనివ్వడం పై విమర్శలు, ట్రోల్స్, మీమ్స్ ఒకవైపు ఇబ్బంది పెడుతూ ఉంటే, మరోవైపు ఇదే వివాదంపై తమిళనాడు ప్రభుత్వం రంగంలోకి దిగి, వారి సమస్యను మరింత తీవ్రం చేసింది.

నయనతార దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో
నయనతార దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో

నయనతార దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో

ప్రముఖ హీరోయిన్ నయనతార, ఆమె భర్త, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ సోమవారం ఒక ప్రకటన చేశారు. సరోగసీ ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు వారు వెల్లడించారు.

Nayanthara Surrogacy row: మరుక్షణం నుంచే ట్రోలింగ్స్…

ఆ ప్రకటన వెలువడిన క్షణం నుంచే విమర్శలు ప్రారంభమయ్యాయి. అద్దె గర్భం అవసరమేంటని?, 9 నెలలు గర్భం మోయడం కూడా కష్టమవుతోందా? అని, డబ్బు, కెరియర్ కోసం అమ్మతనాన్ని కూడా పణంగా పెడుతున్నారని వరుసగా విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే, నిబంధనల ప్రకారమే వారు సరోగసీకి వెళ్లారా? అన్న ప్రశ్న కూడా తలెత్తింది.

Nayanthara Surrogacy row: రంగంలోకి తమిళనాడు ప్రభుత్వం

ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం రంగంలోకి దిగింది. నిబంధనల ప్రకారమే సరోగసీ ద్వారా నయనతార జంట కవల పిల్లలకు జన్మనిచ్చారా? అనే విషయంపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ స్పష్టం చేశారు. నయన తార సరోగసీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయమై డైరెక్టర్, మెడికల్ సర్వీసెస్ విచారణ జరుపుతారన్నారు. అయితే, దీనిపై నయనతార దంపతులు ఇంతవరకు స్పందించలేదు.

Nayanthara Surrogacy row: జూన్ లో పెళ్లి, అక్టోబర్ లో కవలలు

నయన తార, విఘ్నేశ్ శివన్ ఈ సంవత్సరం జూన్ లో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే వారు సరోగసీ ద్వారా పిల్లలు కనాలని నిర్ణయించుకున్నారు. తాజాగా, తమకు కవల పిల్లలు జన్మించారని ప్రకటించారు. ఇద్దరు మగ పిల్లలు జన్మించారని, వారి పేర్లు ఉయిర్, ఉలఘం అని పెట్టామని వెల్లడించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరి 25 నుంచి సరోగసి రెగ్యులేషన్ యాక్ట్(Surrogacy (Regulation) Act, 2021) ను అమల్లోకి తీసుకువచ్చింది. కమర్షియల్ సరోగసీని ఈ చట్టం సంపూర్ణంగా నిషేధిస్తుంది. అలాగే, పెళ్లి అయిన ఐదేళ్ల తరువాత మాత్రమే సరోగసీకి వెళ్లాల్సి ఉంటుంది. అందుకు, ముందుగా, వారు స్వయంగా గర్భం దాల్చి, పిల్లలను కనేందుకు వైద్య పరమైన అడ్డంకులు ఉన్నట్లు నిర్ధారించాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం