తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mphil Not Recognised Degree: ‘‘ఎంఫిల్ డిగ్రీకి గుర్తింపు లేదు; ఆ కోర్సులో చేరకండి’’ - యూజీసీ

MPhil not recognised degree: ‘‘ఎంఫిల్ డిగ్రీకి గుర్తింపు లేదు; ఆ కోర్సులో చేరకండి’’ - యూజీసీ

HT Telugu Desk HT Telugu

27 December 2023, 17:07 IST

    • MPhil not recognised degree: ఎంఫిల్ (MPhil) డిగ్రీకి గుర్తింపు లేదని, భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు అందించే ఏ ఎంఫిల్ ప్రోగ్రామ్ లో కూడా చేరవద్దని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC వ) విద్యార్థులకు సూచించింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

ప్రతీకాత్మక చిత్రం

MPhil not recognised degree: 2023-24 విద్యా సంవత్సరంలో ఎంఫిల్ కోర్సు ల్లో అడ్మిషన్లు తీసుకోవడం నిలిపివేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) డిసెంబర్ 27 న దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. ఎంఫిల్ గుర్తింపు పొందిన డిగ్రీ కాదని పేర్కొంది. యుజిసి కార్యదర్శి మనీష్ జోషి కూడా భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు అందించే ఎంఫిల్ ప్రోగ్రామ్ లలో చేరవద్దని విద్యార్థులకు సూచించారు.

ట్రెండింగ్ వార్తలు

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

Fact Check : 'ల్యాబ్​లో పిల్లలను నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు' అంటున్న ఈ వైరల్​ వీడియోలో నిజమెంత?

Sushil Modi death : బీజేపీ సీనియర్​ నేత సుశీల్ కుమార్​​ మోదీ కన్నుమూత..

ఆ కోర్సులో చేరవద్దు

ఎంఫిల్ (Master of Philosophy- MPhil) ప్రోగ్రామ్ కోసం కొన్ని విశ్వవిద్యాలయాలు కొత్తగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు యూజీసీ దృష్టికి వచ్చింది. దాంతో, విద్యార్థులను అప్రమత్తం చేసే ఉద్దేశంతో యూజీసీ ఈ ప్రకటన చేసింది. ఎంఫిల్ డిగ్రీకి గుర్తింపు లేదన్న విషయం విద్యార్థులంతా గుర్తుంచుకోవాలని, అందువల్ల ఏ విభాగంలో కూడా ఎంఫిల్ కోర్సులో చేరవద్దని స్పష్టం చేసింది. యూజీసీ చట్టంలోని నంబర్ 14 రెగ్యులేషన్ ప్రకారం ఉన్నత విద్యాసంస్థలు ఎలాంటి ఎంఫిల్ ప్రోగ్రామ్ ను అందించరాదు.

ప్రైవేటు యూనివర్సిటీలకు కూడా..

దేశవ్యాప్తంగా అనేక కొత్త ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటవుతున్నాయి. వాటిలో చాలా వరకు యూజీసీ గుర్తింపు లేని కోర్సులను అందిస్తున్నాయి. ఆ యూనివర్సిటీల విషయంలో విద్యార్థులు అప్రమత్తతతో ఉండాలని యూజీసీ సూచించింది. గుర్తింపు లేని యూనివర్సిటీల్లో, లేదా గుర్తింపు లేని కోర్సుల్లో చేరవద్దని సూచించింది. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 140 వరకు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఇలా ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటులో గుజరాత్ అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. గత ఐదేళ్లలో గుజరాత్ లో 28, మహారాష్ట్రలో 15, మధ్యప్రదేశ్ లో14, కర్నాకటలో 10 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి.

తదుపరి వ్యాసం