తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mla Slapped By Her Husband: ఎమ్మెల్యేను కొట్టిన భర్త

MLA slapped by her husband: ఎమ్మెల్యేను కొట్టిన భర్త

02 September 2022, 9:00 IST

  • MLA slapped by her husband: పంజాబ్‌లో ఆప్ ఎమ్మెల్యేపై ఆమె భర్త దాడి చేశారు. ఈ ఘటనపై పంజాబ్ స్టేట్ మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది.

ఎమ్మెల్యేపై దాడి చేస్తున్న భర్త
ఎమ్మెల్యేపై దాడి చేస్తున్న భర్త (Twitter)

ఎమ్మెల్యేపై దాడి చేస్తున్న భర్త

MLA slapped by her husband: పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్‌పై ఆమె భర్త దాడి చేసిన దృశ్యాలతో కూడిన వీడియో వైరల్ అయ్యింది. ఆమె ఇంటివెలుపల ఉన్న సీసీటీవీలో నిక్షిప్తమైన సదరు వీడియో గురువారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి వరుడి కోసం వెతుకుతున్న కుటుంబం

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

Fact Check : 'ల్యాబ్​లో పిల్లలను నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు' అంటున్న ఈ వైరల్​ వీడియోలో నిజమెంత?

జూలై 10న ఈ ఘటన జరిగింది. ఈ వీడియోను ఎవరు లీక్ చేశారో తెలియదని పోలీసులు తెలిపారు. ఘనటపై ఎలాంటి ఫిర్యాదు కూడా అందలేదని వారు తెలిపారు.

తాల్వాండి సాబో నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బల్జిందర్ కౌర్ తన భర్త సుఖ్‌రాజ్ సింగ్‌‌తో వాగ్వాదానికి దిగినప్పుుడు.. ఆయన తన స్థానం నుంచి లేచి వచ్చి ఆమె చెంపపై కొట్టాడు. వారి పక్కనే ఉన్న కొందరు జోక్యం చేసుకుని సుఖ్‌రాజ్ సింగ్‌ను పక్కకు తప్పించేందుకు ప్రయత్నించినట్టు సదరు వీడియోలో దృశ్యాలు కనిపించాయి.

అయితే ఈ వీడియోపై ఎమ్మెల్యే బల్జీందర్ కౌర్ గానీ, ఆమె భర్త సుఖ్‌రాజ్ సింగ్ గానీ స్పందించలేదు. అయితే పంజాబ్ స్టేట్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ మనీషా గులాటీ దీనిపై స్పందిస్తూ ఈ వీడియోను తాను చూశానని, సుమోటోగా దీనిపై కేసు నమోదు చేస్తున్నామని వివరించారు.

భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వంపై ఎన్నికల సమయం నుంచి తరచుగా విమర్శల దాడులు జరుగుతున్నాయి. కాగా శుక్రవారం ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇదే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

2019 ఫిబ్రవరిలో బల్జీందర్ కౌర్ వివాహం చేసుకున్నారు. ఆమె ఆప్ యూత్ వింగ్ మాఝా ప్రాంతానికి కన్వీనర్ గా ఉన్నారు.

బల్జీందర్ కౌర్ పంజాబ్ యూనివర్శిటీ నుంచి ఎం.ఫిల్ పూర్తిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు కౌర్ మాతా గుజ్రీ కాలేజీలో అధ్యాపకురాలిగా ఉన్నారు.

తదుపరి వ్యాసం