తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lays Off In Microsoft | మైక్రోసాఫ్ట్‌లో 1800 మంది ఉద్యోగుల‌కు ఉద్వాస‌న‌

Lays off in Microsoft | మైక్రోసాఫ్ట్‌లో 1800 మంది ఉద్యోగుల‌కు ఉద్వాస‌న‌

HT Telugu Desk HT Telugu

14 July 2022, 15:49 IST

  • Lays off in Microsoft |టెక్ దిగ్గ‌జ కంపెనీల్లో ఉద్యోగుల ఉద్వాస‌న కొన‌సాగుతోంది. తాజాగా, మైక్రోసాఫ్ట్ సంస్థ 1800 ఉద్యోగుల‌కు లేఆఫ్ ప్ర‌క‌టించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విధుల్లో ఉన్న ఉద్యోగులు ఈ ఉద్వాస‌న‌కు గురైన వారిలో ఉన్నారు.

మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్

Lays off in Microsoft | రిస్ట్ర‌క్చ‌రింగ్ ప్రాసెస్‌లో భాగంగా ఈ లేఆఫ్ ప్ర‌క‌టించిన‌ట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. అయితే, ఈ మ‌ధ్య కాలంలో ఇంత ఎక్కువ మందిని సాగ‌నంప‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

Lays off in Microsoft | వివిధ విభాగాల్లో

మైక్రోసాఫ్ట్ లే ఆఫ్ ప్ర‌క‌టించిన 1800 ఉద్యోగుల్లో వివిధ విభాగాల‌కు చెందిన వారు ఉన్నారు. ప్ర‌ధానంగా క‌న్స‌ల్టింగ్‌, క‌స్ట‌మ‌ర్ సొల్యూష‌న్స్‌, పార్ట్‌న‌ర్ సొల్యూష‌న్స్ ఉద్యోగులు ఈ పింక్ స్లిప్ పొందారు. ఈ లేఆఫ్ ప్ర‌క్రియ రీస్ట్ర‌క్చ‌రింగ్ ప్రాసెస్‌లో భాగ‌మ‌ని, త్వ‌ర‌లో పెద్ద ఎత్తున ఉద్యోగుల‌ను రిక్రూట్ చేసుకుంటామ‌ని మైక్రోసాఫ్ట్ ప్ర‌క‌టించింది. మైక్రోసాఫ్ట్ సంస్థ‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 1.8 ల‌క్ష‌లు. వీరిలో ప్ర‌స్తుతం ఒక శాతం కన్నా త‌క్కువ మందికి సంస్థ ఉద్వాస‌న ప‌లికింది.

Lays off in Microsoft | స‌మీక్ష‌

``వివిధ విభాగాల్లో మా వ‌ర్క్ ఫోర్స్‌ను స‌మీక్షిస్తున్నాం. అందులో భాగంగానే కొన్ని ఉద్యోగాల‌కు లే ఆఫ్ ప్ర‌క‌టించాం. బిజినెస్ ప్రాధాన్యాల‌ను నిర్ధారించిన త‌రువాత మ‌ళ్లీ రిక్రూట్‌మెంట్ ఉంటుంది. ఆ త‌రువాత ఇప్పుడు ఉన్న ఉద్యోగుల సంఖ్య క‌న్నా ఎక్కువే ఉంటుంది. సాధార‌ణంగా అన్ని కంపెనీలు చేసే ప‌నే ఇది`` అని మైక్రోసాఫ్ట్ ప్ర‌క‌టించింది.

Lays off in Microsoft | గూగుల్ ప‌రిస్థితి

గూగుల్‌లోని రిక్రూట్ మెంట్ మంద‌గించింది. ఈ సంవ‌త్స‌రం ఇక‌పై రిక్రూట్‌మెంట్‌ను స్లో డౌన్ చేస్తున్న‌ట్లు గూగుల్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. అయితే, కీల‌కమైన ఇంజినీరింగ్‌, టెక్నిక‌ల్ త‌దిత‌ర విభాగాల్లో రిక్రూట్‌మెంట్ కొన‌సాగుతుంద‌ని గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచాయ్ వెల్ల‌డించారు. మెటా, స్నాప్‌,టెస్లా త‌దిత‌ర‌ సంస్థలు కూడా ఇటీవ‌ల కొన్ని ఉద్యోగాల‌కు లేఆఫ్ ప్ర‌క‌టించాయి.

తదుపరి వ్యాసం