తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Meghalaya, Nagaland: ప్రమాణ స్వీకారం చేసిన మేఘాలయ సీఎం: హాజరైన ప్రధాని! నాగాలాండ్‍లోనూ నేడే: ప్రతిపక్షం లేని రాష్ట్రంగా.

Meghalaya, Nagaland: ప్రమాణ స్వీకారం చేసిన మేఘాలయ సీఎం: హాజరైన ప్రధాని! నాగాలాండ్‍లోనూ నేడే: ప్రతిపక్షం లేని రాష్ట్రంగా.

07 March 2023, 11:24 IST

    • Meghalaya, Nagaland CMs Sworn in: మేఘాలయ ముఖ్యమంత్రిగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాగాలాండ్ సీఎంగా రియో కూడా నేడు ప్రమాణం చేయనున్నారు.
Meghalaya, Nagaland CMs: ప్రమాణ స్వీకారం చేసిన మేఘాలయ సీఎం: హాజరైన ప్రధాని!
Meghalaya, Nagaland CMs: ప్రమాణ స్వీకారం చేసిన మేఘాలయ సీఎం: హాజరైన ప్రధాని! (ANI Photo)

Meghalaya, Nagaland CMs: ప్రమాణ స్వీకారం చేసిన మేఘాలయ సీఎం: హాజరైన ప్రధాని!

Meghalaya, Nagaland CMs Sworn in: మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) అధినేత కాన్రాడ్ సంగ్మా (Conrad Sangma) వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. షిల్లాంగ్‍లో మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే నేషనల్ డెమక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (NDPP) నేత నెఫియూ రియో (Neiphiu Rio) కూడా నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నేడే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కూడా మోదీ, షా, నడ్డా త్రయం వెళ్లనుంది. ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాల్లో బీజేపీ భాగస్వామిగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

రియో ఐదోసారి.. సంగ్మా రెండోసారి

Meghalaya, Nagaland CMs Sworn in: నాగాలాండ్ సీఎంగా వరుసగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు NDPP నేత రియో. 2003లో ఆయన తొలిసారి సీఎం అయ్యారు. ఆ తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన సహా చాలా సంఘటనలు జరిగాయి. అయితే ఆ తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికలోనూ ఆయన పార్టీయే గెలిచింది. నాగాలాండ్‍‍కు సుదీర్ఘ కాలం పాటు సీఎంగా ఉన్న రికార్డు నెఫియూ రియోదే. ఇక ఎన్‍పీపీ నేత కాన్రాడ్ సంగ్మా.. వరుసగా రెండోసారి నాగాలాండ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఈ ఏడాది ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ రాకపోయినా.. బీజేపీ సహా ఇతర పార్టీల మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గత హయాంలోనూ ఆయనకు బీజేపీ మద్దతు ఇచ్చింది.

మేఘాలయ, నాాగాలాండ్ ఎన్నికల ఫలితాలు

Meghalaya, Nagaland Election Results: ఫిబ్రవరి 27వ తేదీన మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మార్చి 2 ఫలితాలు వచ్చాయి. మేఘాలయలో ఎన్‍పీపీ 26 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. యూడీపీ 11 చోట్ల గెలిచింది. బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ చెరో 5 చోట్ల గెలిచాయి. యూడీపీ, బీజేపీ మద్దతు ఇవ్వటంతో ఎన్‍పీపీ.. మేఘాలయలో మరోసారి అధికారం చేపట్టింది. సంగ్మా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

60 స్థానాలు ఉన్న నాగాలాండ్‍లో ఎన్‍డీపీపీ 25 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 12 స్థానాల్లో, ఎన్‍సీపీ 7 చోట్ల గెలిచాయి. ఇతరులు 16 చోట్ల నెగ్గారు.

ప్రతిపక్షం లేని నాగాలాండ్‍

Nagaland: నాగాలాండ్‍లో ఈసారి ప్రతిపక్షమే లేదు. ఎన్‍డీపీపీ-బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఎన్‍సీపీ, ఆర్పీఐ, జేడీయూ ఇలా అన్ని పార్టీలు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టు లేఖలు అందించాయి. ఇండిపెండెంట్లు కూడా జైకొట్టారు. దీంతో నాగాలాండ్‍లో ఈసారి అపోజిషన్ పార్టీనే లేదు.

తదుపరి వ్యాసం