తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jee Main Answer Key 2024 : జేఈఈ మెయిన్‌ సెషన్‌ -1 ఆన్సర్‌ ‘కీ’ విడుదల - ఇలా చెక్ చేసుకోండి

JEE Main Answer Key 2024 : జేఈఈ మెయిన్‌ సెషన్‌ -1 ఆన్సర్‌ ‘కీ’ విడుదల - ఇలా చెక్ చేసుకోండి

07 February 2024, 10:05 IST

    • JEE Main 2024 Session 1 Answer key 2024: జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 2024 ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలను JEE పేర్కొంది. ఆన్సర్ కీ ని ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ చూడండి…
జేఈఈ మెయిన్‌ సెషన్‌ -1 ఆన్సర్‌ ‘కీ’ విడుదల
జేఈఈ మెయిన్‌ సెషన్‌ -1 ఆన్సర్‌ ‘కీ’ విడుదల (Shutterstock)

జేఈఈ మెయిన్‌ సెషన్‌ -1 ఆన్సర్‌ ‘కీ’ విడుదల

JEE Main 2024 Session 1 Answer key 2024: జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్షలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదలైంది. ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకూ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ కీ ని https://jeemain.nta.ac.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది. అంతేకాకుండా అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా విడుదల చేసింది. అప్లికేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాలతో వీటిని పొందవచ్చు.

ఎలా చెక్ చేసుకోవాలంటే…?

జేఈఈ మెయిన్ సెషన్ -1 పరీక్ష రాసిన అభ్యర్థులు మొదటగా https://jeemain.nta.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

answer key of JEE Main session 1 అనే ఆప్షన్ పై నొక్కాలి.

ఇక్కడ కనిపించే కాలమ్స్ లో అప్లికేషన్ నెంబర్ తో పాటు పుట్టినతేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.

వ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఆన్సర్ కీ డిస్ ప్లే అవుతుంది.

జేఈఈ మెయిన్ సెషన్ -1 2024 పరీక్షకు 12 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో పేపర్ 2ని 55,493 మంది రాశారు. పేపర్ 1 (BE/BTech) పరీక్షకు 11,70,036 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ పేపర్ జనవరి 24న, ఇంజినీరింగ్ పరీక్ష జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరిగింది.

ఆన్సర్ కీలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 8వ తేదీలోపు సమర్పించాల్సి ఉంటుంది. 8వ తేదీన రాత్రి 11 గంటలోపు వరకు గడువు ఉంటుంది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అభ్యర్థులు మొదటగా https://jeemain.ntaonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆన్సర్ కీ ఛాలెంజ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విండో లో అప్లికేషన్ నెంబర్, పుట్టినతేదీతో పాటు మీ అభ్యంతరాలను నమోదు చేయాలి.సబ్మిట్ బటన్ పై నొక్కితే ప్రక్రియ పూర్తి అవుతుంది.

ఈ పరీక్షా ఫలితాలను ఫిబ్రవరి 12న విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం విడుదల చేసిన ఆన్సర్ కీలో ప్రశ్నల వారీగా ఏవైనా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ప్రొవిజనల్ ఆన్సర్ కీ పై అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తుది ఆన్సర్ కీని, ఫలితాలను విడుదల చేస్తుంది.

మరోవైపు జేఈఈ మెయిన్స్ 2024 సెషన్-2కు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 2వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ నెలలో సెషన్-2 పరీక్షలను నిర్వహించేందుకు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోంది.

జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 2 దరఖాస్తు ప్రక్రియ

జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ 2024 సెషన్ 2 రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ అనుసరించాలి.

ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్‌సైట్ https://jeemain.nta.ac.in/ సందర్శించండి.

హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ 2024 సెషన్ 2 లింక్‌పై క్లిక్ చేయండి.

ఇక రిజిస్టర్ చేసుకోండి. ఖాతాలోకి లాగిన్ అవ్వండి.

అప్లికేషన్ ఫారమ్ నింపి ఫీజు చెల్లించాలి.

సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.

తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపరుచుకోండి.

తదుపరి వ్యాసం