తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jacinda Ardern: న్యూజిలాండ్ ప్రధాని షాకింగ్ నిర్ణయం.. రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన.. ముఖ్యమైన 5 విషయాలు

Jacinda Ardern: న్యూజిలాండ్ ప్రధాని షాకింగ్ నిర్ణయం.. రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన.. ముఖ్యమైన 5 విషయాలు

19 January 2023, 10:56 IST

    • New Zealand PM Jacinda Ardern resign: న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జెసిండా ఆర్జెర్న్ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
New Zealand: న్యూజిలాండ్ ప్రధాని షాకింగ్ నిర్ణయం.. రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన
New Zealand: న్యూజిలాండ్ ప్రధాని షాకింగ్ నిర్ణయం.. రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన (AP)

New Zealand: న్యూజిలాండ్ ప్రధాని షాకింగ్ నిర్ణయం.. రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన

New Zealand PM Jacinda Ardern resign: న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జెసిండా అర్డెర్న్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఫిబ్రవరి 7వ తేదీ ప్రధానిగా తన చివరి రోజు అని వెల్లడించారు. తీవ్ర భావోద్వానికి గురై కన్నీళ్లతో ఆమె ఈ నిర్ణయాన్ని నేడు (జనవరి 19, గురువారం) ప్రకటించారు. 2017లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడగా.. ఆమె ప్రధాని పదవి చేపట్టారు. ఆ తర్వాత 2020 ఎన్నికల్లో తన పార్టీ లేబర్ బార్టీని విజయపథంవైపు నడిపించి మళ్లీ పదవిలో కొనసాగారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

Fact Check : 'ల్యాబ్​లో పిల్లలను నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు' అంటున్న ఈ వైరల్​ వీడియోలో నిజమెంత?

Sushil Modi death : బీజేపీ సీనియర్​ నేత సుశీల్ కుమార్​​ మోదీ కన్నుమూత..

నాకు ఇప్పుడు సమయం వచ్చింది

New Zealand PM Jacinda Ardern resign: “కష్టంగా ఉన్నందుకు నేను వెళ్లడం లేదు. అలా అయి ఉంటే పదవి చేజిక్కించుకున్న రెండు నెలల్లోనే తప్పుకునేదాన్ని. ఈ పదవికి సరైన న్యాయం చేసేందుకు కావాల్సిన శక్తి నాలో తగ్గిపోయిందని ఇప్పుడు నాకు అనిపించింది. నేను మనిషిని. రాజకీయ నాయకులు కూడా మనుషులే. ఎంత కాలం కష్టపడి పని చేయగలరో అంత కాలం చేస్తారు. ఆ తర్వాత వైదొలుగుతారు. నాకు.. ఇప్పుడు సమయం వచ్చింది” అని జెసిండా చెప్పారు. ఎంపీగా కొనసాగుతానని అన్నారు. న్యూజిలాండ్‍లో ఈ ఏడాదే ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలోనే ప్రధాని పదవవికి జెసిండా రాజీనామా చేశారు.

  • 2017లో 37 సంవత్సరాల వయసులోనే జెసిండా ఆర్డెర్న్ న్యూజిలాండ్ ప్రధాన మంత్రి పదవి చేపట్టారు. ఓ దేశానికి ప్రధాని అయిన అత్యంత పిన్నవయస్కురాలైన మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.
  • కరోనా వైరస్ కట్టడి విషయంలో జెసిండా ఆర్డెర్న్ వ్యవహరించిన తీరును ప్రపంచం మొత్తం ప్రశంసించింది. తమ దేశాన్ని 50లక్షల మంది జట్టుగా అభివర్ణిస్తూ కలిసికట్టుగా కొవిడ్ అంతానికి కృషి చేయాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు ఇతర పట్ల దయతో మెలగాలని సూచించారు. క్రైస్ట్ చర్చిలో జరిగిన భారీ కాల్పుల తర్వాత ఆమె వ్యవహరించిన తీరు దేశప్రజల్లో శాంతి నెలకొల్పింది.
  • జెసిండా.. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు. నార్త్ ఐల్యాండ్ హింటర్ ల్యాండ్‍‍లో పెరిగారు. ఆమె తండ్రి పోలీసుగా పని చేస్తుండేవారు. కమ్యూనికేషన్స్ లో జెసిండా డిగ్రీ పూర్తి చేశారు.
  • బ్రిటన్‍లోని టోనీ బ్లయర్ ప్రభుత్వంలో పాలసీ అడ్వయిజర్ గానూ గతంలో జెసిండా పని చేశారు. అంతకు ముందు న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లర్స్ కార్యాలయంతో విధులు నిర్వర్తించారు.
  • 2008లో పార్లమెంటు మెంబర్‌గా జెసిండా ఎన్నికయ్యారు. 2017లో లేబర్ పార్టీ డిప్యూటీ లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు.

తదుపరి వ్యాసం