తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Stock Market | ఈ స్టాక్స్​ మీ దగ్గరుంటే.. స్వల్పకాలంలో భారీ లాభాలే..!

Stock market | ఈ స్టాక్స్​ మీ దగ్గరుంటే.. స్వల్పకాలంలో భారీ లాభాలే..!

HT Telugu Desk HT Telugu

24 April 2022, 13:45 IST

    • ఆటో రంగంలోని స్టాక్స్​కు స్వల్పకాలంలో మంచి లాభాలు వస్తాయని మార్కెట్​ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు గల కారణాలను వివరిస్తున్నారు. అవేంటంటే..
స్టాక్​ మార్కెట్​ ఇండియా
స్టాక్​ మార్కెట్​ ఇండియా (REUTERS)

స్టాక్​ మార్కెట్​ ఇండియా

Auto sector stocks | కొవిడ్​ కారణంగా దెబ్బతిన్న రంగాల్లో ఆటో సెక్టార్​ ఒకటి. అందుకు తగ్గట్టుగానే స్టాక్​ మార్కెట్​లో ఆటో సెక్టార్​ షేర్లు పెద్దగా రాణించలేదు. స్టాక్​ మార్కెట్​ పెరిగినా.. ఈ రంగం మాత్రం వెనకంజలోనే ఉండిపోయింది. అయితే.. ఆటో సెక్టార్​కు ఇప్పుడు టైమ్​ వచ్చిందని మార్కెట్​ విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి వరుడి కోసం వెతుకుతున్న కుటుంబం

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

శుక్రవారం సెషన్​లో.. నిఫ్టీ ఆటో 11,000 వద్ద బ్రేకవుట్​ ఇచ్చింది. ఫలితంగా ఆటో రంగంపై మార్కెట్​ వర్గాల్లో బుల్లిష్​ అభిప్రాయం ఏర్పడింది. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో.. నిఫ్టీ ఆటో.. 11వేల మార్కు దాటి ఓపెన్​ అయ్యి.. వారం చివర్లో 11,100 మార్కును అందుకోగలిగితే.. ఆటో షేర్లకు పండగే అని భావిస్తున్నారు. మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్​ను ఎంచుకుంటే స్వల్ప కాలంలోనే మంచి లాభాలు ఆర్జించవచ్చని చెబుతున్నారు.

ఎం అండ్​ ఎం బెస్ట్​…!

అయితే ఈ విషయంపై మరికొంత స్పష్టత వచ్చేంతవరకు వేచిచూడాలని మార్కెట్​ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎం ఆండ్​ ఎం, టాటా మోటార్స్​, మారుతీ సుజుకీ, టీవీఎస్​ మోటార్స్​ వంటి షేర్లు బై కాల్​ ఇస్తున్నారు.

"గురువారం.. నిఫ్టీ ఆటో 11వేల మార్కును అందుకుంది. కానీ ఎక్కువసేపు ఉండలేక 11వేల దిగువకు పడిపోయింది. శుక్రవారం సెషన్​లో కూడా ఇదే జరిగింది. 11వేల మార్కును అందుకుంది. బ్రేక్​అవుట్​ లెవల్​ బయటే ముగిసింది. సోమవారం 11వేలు దాటితే.. ఆటో స్టాక్స్​ కొనుకొవచ్చు," అని చాయిస్​ బ్రోకింగ్​ సంస్థ ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​ సుమీత్​ బగాడియా వెల్లడించారు.

"2022 నాలుగో త్రైమాసికంలో ఆటో సంస్థలు వాహనాల ధరలు పెంచాయి. ముడిసరకు ధరలు పెరిగాయని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఏప్రిల్​- జూన్​ త్రైమాసికం ఫలితాల్లో ఈ ప్రభావం కనిపిస్తుంది. వాహనాల అమ్మకాలు పడిపోకపోతే.. మంచి ఫలితాలే వెలువడే అవకాశాలు ఉన్నాయి. కొవిడ్​ నాలుగో వేవ్​ రాకపోయినా.. ఆటో సెక్టార్​కు మంచిదే. సెమీకండక్టర్​ సమస్యలు పరిష్కారమైతే ఆటో రంగానికి ఇంకా మంచిది. మార్జిన్లు పెరుగుతాయి. అందువల్ల స్పల్పకాలంలో ఆటో సెక్టార్​ షేర్లు పెరిగే అవకాశం ఉంది," అని ప్రాఫిట్​మార్ట్​ సెక్యూరిటీస్​ సంస్థ రీసెర్చ్​ హెడ్​ అవినాష్​ గోరక్షకర్​ పేర్కొన్నారు.

ఎం అండ్​ ఎం షేర్లు కొనుగోలు చేస్తే మంచిదని అవినాష్​ అభిప్రాయపడ్డారు.

గమనిక: ఇది కేవలం సమాచారం కోసం రాసిన కథనం మాత్రమే. ఇందులోని అభిప్రాయాలు కేవలం వ్యక్తిగతం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. పెట్టుబడులు పెట్టే ముందు.. మీరు మీ ఫైనాన్షియల్​ అడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కర్​.

టాపిక్

తదుపరి వ్యాసం