తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Unemployment | దేశంలో పైపైకి అన్ ఎంప్లాయ్‌మెంట్‌

Unemployment | దేశంలో పైపైకి అన్ ఎంప్లాయ్‌మెంట్‌

HT Telugu Desk HT Telugu

06 July 2022, 20:58 IST

  • దేశంలో నిరుద్యోగిత రేటు క్ర‌మంగా పెరుగుతోంది. క‌రోనా అనంత‌రం క్ర‌మంగా సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. పారిశ్రామిక‌, సేవా రంగాలు వృద్ధి చెందుతున్నాయి. అయినా, దేశంలో నిరుద్యోగిత ఆందోళ‌న‌క‌ర స్థాయిలో పెరుగుతోంది.

ప్ర‌తీకాత్మ‌క చిత్రం
ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

జూన్ నెల‌లో రికార్డు స్థాయిలో..

జూన్ నెల‌లో భార‌త్‌లో అత్య‌ధికంగా నిరుద్యోగిత న‌మోదైంది. పెద్ద సంఖ్య‌లో ఉద్యోగులు త‌మ‌ ఉద్యోగాలను కోల్పోయారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) విడుద‌ల చేసిన డేటా ప్ర‌కారం దేశంలో ఒక్క జూన్ నెల‌లోనే 1.3 కోట్ల (13 మిలియ‌న్ల‌) మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగుల సంఖ్య‌ 404 మిలియ‌న్ల నుంచి 390 మిలియ‌న్ల పడిపోయింది. గ‌త 12 నెల‌ల్లో ఇదే అత్య‌ధిక‌మ‌ని సీఎంఐఈ వెల్ల‌డించింది. లేబర్ మార్కెట్ క్షీణ‌త‌ దేశవ్యాప్తంగా ఉంద‌ని సీఎంఐఈ సీఈఓ మహేష్ వ్యాస్ తెలిపారు. జూన్ 2022లో వేత‌న జీవుల్లో 25 ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు కోల్పోగా, మిగిలిన ఉద్యోగాలు అసంఘ‌టిత‌రంగంలో కోల్పోయార‌ని తెలిపారు. వ్యవసాయ రంగంలో జూన్‌లో దాదాపు 8 మిలియన్ల మంది ఉపాధి కోల్పోయార‌ని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

Uber ride horror: కారులో ఉబర్ డ్రైవర్ హస్తప్రయోగం; భయాందోళనలకు గురైన మహిళ

హ‌రియాణాలో అత్య‌ధికం

2022 జూన్ నెల‌లో 7.80 శాతం నిరుద్యోగిత‌ రేటు న‌మోదు అయింద‌ని సీఎంఐఈ పేర్కొంది. మే నెల‌లో ఇది 7.12 శాతంగా ఉంది. జూన్‌లో ప‌ట్ట‌ణ నిరుద్యోగ రేటు 7.30% , గ్రామీణ నిరుద్యోగ రేటు 8.03 శాతానికి పెరిగింది. నిరుద్యోగిత‌ రేటు హ‌రియాణాలో అత్య‌ధికంగా 30.6 శాతం, అత్ప‌ల్పంగా పుదుచ్చేరి 0.8%శాతం న‌మోదు అయింది.

తెలంగాణ క‌న్నా ఏపీ బెట‌ర్

నిరుద్య‌గిత‌ రేటు విష‌యంలో తెలంగాణ క‌న్నా ఆంధ్ర‌ప్ర‌దేశ్ మెరుగ్గా ఉంది. మే, జూన్ నెల‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిరుద్యోగిత‌ రేటులో ఎలాంటి మార్పు లేదు. కానీ, తెలంగాణ‌లో మాత్రం ఇది 10 శాతానికి పెరిగింది. మే నెల‌లో ఏపీలో 4.4 శాతం నిరుద్యోగ రేటు న‌మోదు కాగా, జూన్ నెల‌లో ఆ రేటులో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. అయితే తెలంగాణ‌లో మాత్రం మే నెల‌లో 9.4 శాతం నిరుద్యోగ రేటు న‌మోదు కాగా, జూన్ నెల‌లో 10 శాతానికి పెరిగింది. దేశంలో నిరుద్యోగ రేటు ఎక్క‌వ ఉన్న రాష్ట్రాల్లో హ‌ర్యానా (30.6%), రాజ‌స్థాన్ (29.8% ), అస్సాం (17.2%)మొద‌టి మూడు స్థానాల్లో ఉన్నాయి.

తదుపరి వ్యాసం