తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi's Message To Bjp: ‘‘2024 ఎన్నికల్లో చరిత్ర సృష్టించాలి.. సిద్ధం కండి’’

PM Modi's message to BJP: ‘‘2024 ఎన్నికల్లో చరిత్ర సృష్టించాలి.. సిద్ధం కండి’’

HT Telugu Desk HT Telugu

17 January 2023, 19:35 IST

  • PM Modi's message to BJP: లోక్ సభ ఎన్నికలకు ఇంకా 400 రోజులు మాత్రమే ఉన్నాయని, నేతలంతా ఓటర్లను కలవాలని ప్రధాని మోదీ (PM Modi) బీజేపీ నేతలకు సూచించారు. 

ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ నడ్డా
ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ నడ్డా (PTI)

ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ నడ్డా

PM Modi's message to BJP: బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ (BJP National executive committee) సమావేశాల చివరి రోజైన మంగళవారం ప్రధాని మోదీ (PM Modi) పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు తరుముకు వస్తున్నాయని, అంతా ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశాలను (BJP National executive committee)ద్దేశించి మోదీ మంగళవారం ప్రసంగించారు.

ట్రెండింగ్ వార్తలు

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి వరుడి కోసం వెతుకుతున్న కుటుంబం

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

PM Modi's message to BJP: 400 రోజుల్లో ఎన్నికలు..

ఎన్నికలకు ఎక్కువ వ్యవధి ప్రధాని మోదీ (PM Modi) పార్టీ నేతలకు గుర్తు చేశారు. నేతలంతా ఓటర్లను కలుసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సున్న యువతకు దగ్గర కావడానికి కృషి చేయాలన్నారు. ‘గత ప్రభుత్వాల పాలనపై, వారు చేసిన నష్టంపై 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సున్న యువతకు పెద్దగా అవగాహన ఉండదు. వారికి ఆ అవగాహన కల్పించాలి. బీజేపీ (BJP) అందిస్తున్న సుపరిపాలన కొనసాగాల్సిన అవసరాన్ని వారికి వివరించాలి’ అని మోదీ (PM Modi) దిశానిర్దేశం చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించాలని బీజేపీ BJP నాయకులకు పిలుపునిచ్చారు.

PM Modi's message to BJP: ఇది స్వర్ణయుగం

భారతదేశంలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందని, ఇదే అత్యుత్తమ కాలమని ప్రధాని మోదీ (PM Modi) అభివర్ణించారు. దేశ అభివృద్ధి కోసం అంతా కృషి చేయాలన్నారు. ప్రజలంతా దేశాభివృద్ధికి అంకితం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీజేపీ ఇప్పుడు కేవలం ఒక రాజకీయ ఉద్యమం కాదని, బీజేపీ ఇప్పుడు ఒక సామాజిక ఉద్యమంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) వివరించారు. ‘ప్రస్తుతం కొనసాగుతున్న అమృత కాలాన్ని కర్తవ్య కాలంగా మార్చుకోవాలి. అప్పుడే దేశాభివృద్ధి వేగవంతం అవుతుంది’ అన్నారు. సరిహద్దు గ్రామాలకు వెళ్లాలని, అక్కడి ప్రజలకు బీజేపీని దగ్గర చేయాలని ప్రధాని (PM Modi) సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు వారికి చేరేలా చూడాలన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశాలను ఉద్దేశించి ప్రధాని (PM Modi) చేసిన ప్రసంగం వివరాలను బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మీడియాకు వెల్లడించారు.

టాపిక్

తదుపరి వ్యాసం