తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Vande Bharat Train Chennai To Mysore: చెన్నై మైసూర్ మధ్య వందే భారత్ ట్రైన్

Vande bharat train chennai to mysore: చెన్నై మైసూర్ మధ్య వందే భారత్ ట్రైన్

HT Telugu Desk HT Telugu

14 October 2022, 14:31 IST

    • Vande bharat train chennai to mysore: చెన్నై మైసూర్ మధ్య వందే భారత్ ట్రైన్ నడిచేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. 
గురువారం ఉనాలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
గురువారం ఉనాలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PTI)

గురువారం ఉనాలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఢిల్లీ: భారతదేశపు ఐదో సెమీ-హై-స్పీడ్ రైలు చెన్నై నుండి మైసూర్ వరకు నడుస్తుందని రైల్వే అధికారులు శుక్రవారం హిందుస్తాన్ టైమ్స్‌కు తెలిపారు. ఇది నవంబర్ రెండో వారం నుండి తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

Fact Check : 'ల్యాబ్​లో పిల్లలను నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు' అంటున్న ఈ వైరల్​ వీడియోలో నిజమెంత?

Sushil Modi death : బీజేపీ సీనియర్​ నేత సుశీల్ కుమార్​​ మోదీ కన్నుమూత..

‘చెన్నై నుండి బెంగళూరు మీదుగా మైసూర్‌కు బయలుదేరే రైలు నవంబర్ 5 న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) నుండి ట్రయల్ రన్ కోసం బయలుదేరుతుంది..’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘ఇది నవంబర్ 10 నుండి కార్యకలాపాలను ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది..’ అని వివరించారు.

ప్రస్తుతం రైలు టైమ్ టేబుల్ ఖరారు ప్రక్రియ కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. ‘రైలు టైమ్ టేబుల్, ఛార్జీలు, ప్రారంభోత్సవ వేడుక మొదలైన వివరాలు రూపకల్పనలో ఉన్నాయి..’ అని వారు తెలిపారు.

ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ మధ్య నడుస్తున్న దేశంలోని నాలుగో వందే భారత్ (వీబీ) రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో ప్రారంభించిన ఒక రోజు తర్వాత అధికారులు ఈ విషయం వెల్లడించారు.

ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ మధ్య సెమీ-హై-స్పీడ్ రైలు సాధారణ కార్యకలాపాలు అక్టోబరు 19 నుండి ప్రారంభమవుతాయి. బుధవారం మినహా అన్ని రోజులలో నడుస్తుంది.

హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల ముఖ్యమంత్రులు జైరాం ఠాకూర్, మనోహర్ లాల్ ఖట్టర్ కూడా హై-స్పీడ్ రైలులో ప్రయాణించారు. ఉనా నుంచి న్యూఢిల్లీకి ప్రయాణ సమయం రెండు గంటలు తగ్గుతుందని రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇటీవల, స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన సెమీ-హై-స్పీడ్ రైలు, వందే భారత్ సిరీస్ కింద మూడో రైలు గాంధీనగర్ నుండి ముంబై మధ్య సెప్టెంబర్ 30న ప్రధాన మంత్రి ప్రారంభించారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ-కత్రా మార్గాలలో కూడా నడుస్తున్నాయి.

తదుపరి వ్యాసం