తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Republic Day 2024 Live Updates : కర్తవ్య పథ్​లో ఘనంగా రిపబ్లిక్​ డే వేడుకలు..​
రిపబ్లిక్​ డే లైవ్​ అప్డేట్స్​..
రిపబ్లిక్​ డే లైవ్​ అప్డేట్స్​..

Republic day 2024 live updates : కర్తవ్య పథ్​లో ఘనంగా రిపబ్లిక్​ డే వేడుకలు..​

26 January 2024, 12:44 IST

  • Republic day 2024 live updates : దేశ ప్రజలకు 75వ గణతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ నేపథ్యంలో.. దిల్లీతో పాటు దేశవ్యాప్తంగా రిపబ్లిక్​ డే వేడుకల లైవ్​ అప్డేట్స్​ కోసం ఈ హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగు బ్లాగ్​ని ఫాలో అవ్వండి..

26 January 2024, 12:44 IST

రిపబ్లిక్​ డే పరేడ్​ ముగింపు..

దిల్లీ కర్తవ్య పథ్​ వద్ద రిపబ్లిక్​ డే పరేడ్​ ముగిసింది. రాష్ట్రపతి ముర్ము, ఫ్రాన్స్​ అధ్యక్షుడు మాక్రాన్​లు రాష్ట్రపతి భవన్​కు బయలుదేరారు.

26 January 2024, 12:37 IST

రఫేల్​ విన్యాసాలు..

కర్తవ్య పథ్​పై మారుత్​ ఫార్మేషన్​లో ఆరు రఫేల్​ జెట్లు దూసుకెళ్లాయి. ఆ దృశ్యాలు ప్రేక్షకులను కనువిందు చేశాయి.

26 January 2024, 12:02 IST

శకటాల ప్రదర్శన..

ఆర్మీ మార్చ్​ ముగిసింది. వివిధ రాష్ట్రాల శకటాలను కర్తవ్య పథ్​లో ప్రదర్శిస్తున్నారు.

26 January 2024, 11:36 IST

భారత శక్తి ఇది..

దిల్లీ కర్తవ్య పథ్​లో రిపబ్లిక్​ డే పరేడ్​ అట్టహాసంగా జరుగుతోంది. బీఎస్​ఎఫ్​, వాయుసేన మొదలైన భద్రతా దళాలు తమ శక్తి సామర్థ్యాన్ని చాటి చెప్పాయి.

26 January 2024, 11:11 IST

కర్తవ్య పథ్​లో నారీ శక్తి..

కర్తవ్య పథ్​లో నారీశక్తి ఆవిష్కృతమైంది. ట్రై- సర్వీస్​లకు చెందిన మహిళా సైనికులు.. కర్తవ్య పథ్​లో మార్చ్​ నిర్వహించారు. ఇది జరగడం చరిత్రలో తొలిసారి!

26 January 2024, 11:02 IST

భారత సైన్యం శక్తి..

కర్తవ్య పథ్​లో భారత సైనిక శక్తిని ప్రదర్శిస్తున్నారు. రాకెట్లు, యుద్ధ ట్యాంకర్లును సైన్యం ప్రదర్శిస్తోంది.

26 January 2024, 10:48 IST

రిపబ్లిక్​ డే పరేడ్​..

కర్తవ్యపథ్​లో రిపబ్లిక్​ డే వేడుకలు మొదలయ్యాయి. పరేడ్​ ప్రారంభమైంది.

26 January 2024, 10:40 IST

కర్తవ్యపథ్​లో ఈవెంట్​ మొదలు..

కర్తవ్యపథ్​లో రాష్ట్రపతి ముర్ము, ఫ్రాన్స్​ అధ్యక్షుడు మాక్రాన్​కు మోదీ స్వాగతం పలికారు.

26 January 2024, 10:28 IST

కర్తవ్య పథ్​కు రాష్ట్రపతి..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్​ మాక్రాన్​లు.. కర్తవ్యపథ్​కు బయలుదేరారు.

26 January 2024, 10:23 IST

75ఏళ్లల్లో తొలిసారి..

ఛత్తీస్​​గఢ్​ బస్తర్​లో రిపబ్లిక్​ డే వేడుకలు జరగనున్నాయి. నక్సల్​ ప్రభావితమైన బస్తర్​లోని గ్రామాల్లో 75ఏళ్లల్లో తొలిసారిగా గణతంత్ర్య వేడుకలు జరుగుతుండటం విశేషం.

26 January 2024, 10:17 IST

నేషనల్​ వార్​ మెమోరియల్​లో మోదీ..

రిపబ్లిక్​ డే సందర్భంగా.. ప్రధాని మోదీ.. నేషనల్​ వార్​ మెమోరియల్​కు వెళ్లారు. అమర వీరులకు నివాళులర్పించారు. ఇంకొద్ది సేపట్లో ఎర్రకోటకు వెళతారు.

26 January 2024, 9:53 IST

రష్యా విషెస్​​..

దేశ ప్రజలు రష్యా.. వినూత్నంగా రిపబ్లిక్​ డే శుభాకాంక్షలు తెలిపింది. దిల్లీలోని రష్యా ఎంబసీ ఉద్యోగులు.. గదార్​ సినిమా పాటకు నృత్యాలు చేసి, శుభాకాంక్షలు తెలిపారు.

26 January 2024, 13:07 IST

ఫ్రాన్స్​ అధ్యక్షుడి కీలక ప్రకటన..

రిపబ్లిక్​ డేకి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్​ మాక్రాన్​.. కీలక ప్రకటన చేశారు. ఫ్రాన్స్​లో భారత విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా పలు కీలక చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. వీసా విషయంలోనూ ప్రత్యేక చర్యలు చేపడతామని అన్నారు.

26 January 2024, 9:19 IST

లక్నోోలో..

ఉత్తర్​ ప్రదేశ్​ లక్నోలో జాతీయ జెండాను ఆవిష్కరించారు సీఎం యోగి ఆదిత్యనాథ్​. ప్రజలకు రిపబ్లిక్​ డే శుభాకాంక్షలు చెప్పారు.

26 January 2024, 8:59 IST

తమిళనాడులో..

తమిళనాడులో రిపబ్లిక్​ డే వేడుకలు జరుగుతున్నాయి. గవర్నర్​ రవి.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో సీఎం స్టాలిన్​ కూడా పాల్గొన్నారు.

26 January 2024, 8:26 IST

పరేడ్​ గ్రౌండ్స్​లో..

పరేడ్​ గ్రౌండ్స్​లో జరిగిన రిపబ్లిక్​ డే వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ గవర్నర్​ తమిళి సై.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ ఈవెంట్​లో సీఎం రేవంత్​ రెడ్డి కూడా పాల్గొన్నారు.

26 January 2024, 8:08 IST

పరేడ్​ గ్రౌండ్స్​లో సీఎం రేవంత్​ రెడ్డి

సికింద్రాబాద్​ పరేడ్​ గ్రౌండ్స్​కు వెళ్లారు తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి. అక్కడ ఉన్న వీరుల సైనిక స్మారకం వద్ద నివాళులర్పించారు.

26 January 2024, 13:07 IST

ప్రధాని మోదీ ట్వీట్​..

దేశ ప్రజలకు గణతంత్ర్యి దినోత్సవం శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

26 January 2024, 13:07 IST

రిపబ్లిక్​ డే పరేడ్​..

రిపబ్లిక్​ డే పరేడ్​ని చూసేందుకు ప్రజలు ఇప్పటికే కర్తవ్య పాత్​కు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఈవెంట్​ మొదలయ్యే సమయానికి.. రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.

26 January 2024, 13:07 IST

దిల్లీలో పొగమంచు..

దిల్లీపై కోల్డ్​ వేవ్​ ఎఫెక్ట్​ కొనసాగుతోంది. రిపబ్లిక్​ డే రోజు ఉదయం సైతం.. చలికి గడగడలాడిపోతోంది. ప్రజలు రోడ్లపై చలి కాచుకునేందుకు మంటలు వెలిగించుకుంటున్నారు.

26 January 2024, 13:07 IST

షెడ్యూల్​ ఇదీ..

ఉదయం 10 గంటల 30 నిమిషాలకు రిపబ్లిక్​ డే పరేడ్​ మొదలవుతుంది. దాని కన్నా ముందు.. ప్రధాని మోదీ.. నేషనల్​ వార్​ మెమోరియల్​ని సందర్శించనున్నారు.

26 January 2024, 13:07 IST

ఇండియాకు అమెరికా శుభాకాంక్షలు..

భారత్​కు గణతంత్ర్యి దినోత్సవ శుభాకాంక్షలు చెప్పింది అమెరికా. ఇండియా తమకు వ్యూహాత్మక భాగస్వామి అని పునరుద్ఘటించింది.

26 January 2024, 13:07 IST

గత రిపబ్లిక్ డేలకు వచ్చిన ముఖ్య అతిథులు

ప్రతీ సంవత్సరం మన గణతంత్ర వేడుకలకు మిత్ర దేశాల అధినేతలను ముఖ్య అతిథులుగా పిలవడం ఆవాయితీగా వస్తోంది. ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీలో జరిగే 75వ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో.. గత రిపబ్లిక్ డే లకు వచ్చిన ముఖ్య అతిథుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

26 January 2024, 13:07 IST

పద్మ అవార్డులు విడుదల..

75వ గణతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు.. పద్మ అవార్డులను విడుదల చేసింది కేేంద్రం. 132 మందికి 'పద్మ' పురస్కారాలు లభించాయి. చిరంజీవి, వెంకయ్యకు పద్మవిభూషణ్‌ వరించింది. పూర్తి లిస్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

26 January 2024, 6:19 IST

రిపబ్లిక్​ డే'ని జనవరి 26నే ఎందుకు జరుపుకుంటాము?

జనవరి 26న, భారత రాజ్యంగం అమల్లోకి రావడంతో రిపబ్లిక్​ డేని జరుపుకుంటాము. కానీ.. జనవరి 26నే ఎందుకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది? జనవరి 26నే ఎందుకు ఎంచుకున్నారు? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

26 January 2024, 6:30 IST

గణతంత్ర్య దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాము?

1950 జనవరి 26 నుంచి భారతదేశం రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆరోజు నుంచి రిపబ్లిక్ డే నాడు ప్రతి చోట సగౌరవంగా మువ్వన్నల జెండాను ఎగరవేస్తూ ఉంటాము.

26 January 2024, 6:30 IST

దేశవ్యాప్తంగా..

దేశవ్యాప్తంగా.. రిపబ్లిక్​ డే వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన నగరాల్లోని ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్​ దిపాలతో వెలిగిపోతున్నాయి.

26 January 2024, 6:30 IST

దిల్లీ మెట్రో..

గణతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో.. దిల్లీ మెట్రో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకే ఓపెన్​ అయ్యింది. దాదాపు ప్రతి మెట్రో స్టేషన్​ వద్ద పోలీసు బలగాలు కనిపిస్తున్నాయి.

26 January 2024, 6:30 IST

ముఖ్య అతిథిగా ఫ్రాన్స్​ అధ్యక్షుడు..

ఈ దఫా రిపబ్లిక్​ డే 2024 పరేడ్​లో ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్​ మాక్రాన్​ ముఖ్య అతిథిగా ఉండనున్నారు. ఆయన గురువారమే ఇండియాకు చేరుకున్నారు.

26 January 2024, 5:53 IST

భద్రతా వలయంలో దిల్లీ..

రిపబ్లిక్​ డే వేడుకల నేపథ్యంలో దిల్లీ మహానగరం.. భద్రతా వలయంలోకి జారుకుంది. ఎలాటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

26 January 2024, 6:30 IST

75వ గణతంత్ర్య దినోత్సవం..

75వ రిపబ్లిక్​ డే వేడుకల కోసం దేశం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో.. దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోటపై.. మువ్వన్నెల జెండాను ఎగురవేస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అనంతరం రిపబ్లిక్​ డే పరేడ్​ జరుగుతుంది.

    ఆర్టికల్ షేర్ చేయండి