తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gadkari Praises Ex Pm Manmohan: మన్మోహన్ సింగ్ కు బీజేపీ అగ్ర నేత ప్రశంసలు

Gadkari praises ex PM Manmohan: మన్మోహన్ సింగ్ కు బీజేపీ అగ్ర నేత ప్రశంసలు

HT Telugu Desk HT Telugu

09 November 2022, 0:03 IST

  • Gadkari praises ex PM Manmohan Singh: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు అనూహ్యంగా ప్రత్యర్థి పక్షానికి చెందిన సీనియర్ నాయకుడి నుంచి ప్రశంసలు లభించాయి. 

కేంద్రమంత్రి గడ్కరీ మాజీ ప్రధాని మన్మోహన్ (ఫైల్ ఫొటో)
కేంద్రమంత్రి గడ్కరీ మాజీ ప్రధాని మన్మోహన్ (ఫైల్ ఫొటో)

కేంద్రమంత్రి గడ్కరీ మాజీ ప్రధాని మన్మోహన్ (ఫైల్ ఫొటో)

Gadkari praises ex PM Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు భారత దేశం రుణపడి ఉందని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ప్రత్యర్థి పక్షమైన కాంగ్రెస్ నాయకుడిని బీజేపీ సీనియర్ నేత ప్రశంసించడం సంచలనంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Indian students: భారతీయ విద్యార్థులకు ‘డీపోర్టేషన్’ ముప్పు; భారీగా నిరసనలు

Patna crime news : స్కూల్​ డ్రైనేజ్​లో 4ఏళ్ల బాలుడి మృతదేహం.. నిరసనలతో తగలబడిన పాఠశాల!

JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Gadkari praises ex PM Manmohan Singh: దేశం రుణపడి ఉంది..

1991లో, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు దేశానికి నూతన దిశానిర్దేశం చేశాయని గడ్కరీ ప్రశంసించారు. దివాలా స్థితి నుంచి ఆర్థికంగా పునరుజ్జీవన స్థితికి భారత్ రావడానికి మన్మోహన్ ప్రారంభించిన ఆర్థిక విధానాలే కారణమన్నారు.

Gadkari praises ex PM Manmohan Singh: లిబరల్ ఎకానమీ

మన్మోహన్ సింగ్ ప్రారంభించిన నూతన ఆర్థిక విధానాలతో భారత్ లిబరల్ ఎకానమీగా రూపొందిందని TIOL Awards 2022 కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. గడ్కరీ వివరించారు. లిబరల్ ఎకనమిక్ పాలసీల ద్వారా లభించిన ప్రయోజనాలు పేదలకు, రైతులకు అందాయన్నారు. ఈ విధానాలను ప్రారంభించిన మన్మోహన్ సింగ్ దేశం రుణపడి ఉందన్నారు. లిబరల్ ఎకనమిక్ విధానాల కారణంగా మహారాష్ట్ర మంత్రిగా తాను కూడా రోడ్ల నిర్మాణానికి నిధులను సేకరించగలిగానని తెలిపారు. ఈ ఉదారవాద ఆర్థిక విధానాలతో ప్రయోజనం పొందిన దేశాల్లో చైనా కూడా ఒకటని వివరించారు.

Gadkari praises ex PM Manmohan Singh: సంచలనంగా గడ్కరీ ప్రశంసలు

కేంద్ర రహదారుల మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రశంసల వర్షం కురిపించడం సంచలనంగా మారింది. సాధారణంగా ప్రత్యర్థి పక్షంపై బహిరంగంగా ప్రశంసలు కురిపించడం చాలా అరుదు. అదీకాకుండా, దేశం ప్రస్తుత దుస్థితికి గత కాంగ్రెస్ పాలకుల అసమర్ధ పాలనే కారణమని ప్రధాని మోదీ ప్రతీ సందర్భంలో విరుచుకుపడుతుంటారు. అలాంటిది, ఆయన కేబినెట్ లోని సీనియర్ సహచరుడే ప్రత్యర్థి పక్షం ప్రధానిని ప్రశంసించారు. దీనిపై బీజేపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందని రాజకీయ వర్గాలు చూస్తున్నాయి.

తదుపరి వ్యాసం