తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kejriwal In Gujarat: ‘మోదీ, మోదీ’ నినాదాలతో కేజ్రీవాల్ కు స్వాగతం

Kejriwal in Gujarat: ‘మోదీ, మోదీ’ నినాదాలతో కేజ్రీవాల్ కు స్వాగతం

HT Telugu Desk HT Telugu

20 September 2022, 17:47 IST

  • Kejriwal in Gujarat: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ లోని వదోదర విమానాశ్రయంలో వినూత్న స్వాగతం లభించింది. అయితే, ఆ స్వాగతం కేజ్రీవాల్ కు అంతగా రుచించలేదు. 

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(ఫైల్ ఫొటో)
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(ఫైల్ ఫొటో) (PTI)

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(ఫైల్ ఫొటో)

Kejriwal in Gujarat: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి గుజరాత్ లో పాగా వేయాలన్న ప్రణాళికలో ఉన్న ఆప్ నేత కేజ్రీవాల్ తరచుగా గుజరాత్ లో పర్యటిస్తున్నారు. అందులో బాగంగానే మంగళవారం ఆయన గుజరాత్ లోని వదోదర కు వెళ్లారు.

ట్రెండింగ్ వార్తలు

Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

Kejriwal in Gujarat: మోదీ.. మోదీ

వదోదర విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న కేజ్రీవాల్ ను చూడగానే అక్కడి బీజేపీ శ్రేణులు `మోదీ.. మోదీ` అంటూ మోదీ నినాదాలు చేయడం ప్రారంభించారు. అయితే, ఆ నినాదాలకు పెద్దగా స్పందించకుండానే, చిరునవ్వుతో అక్కడ తనకోసం ఎదురు చూస్తున్న మీడియా ప్రతినిధుల వైపు కేజ్రీావాల్ వెళ్లారు. ఈ లోపు, ఆప్ శ్రేణులు కూడా బీజేపీ కార్యకర్తల నినాదాలకు బదులుగా.. ‘కేజ్రీవాల్.. కేజ్రీవాల్`` అంటూ నినదించడం ప్రారంభించారు.

Kejriwal in Gujarat: మంచి స్వాగతం..

ఈ ఘటనపై బీజేపీ స్పందిస్తూ.. గుజరాత్ లో ఆప్ నేత కేజ్రీవాల్ కు సరైన స్వాగతం లభించిందని వ్యాఖ్యానించింది. ‘మోదీ గుజరాత్ లో ఆప్ కేజ్రీవాల్ కు మంచి స్వాగతం లభించింది’ అని బీజేపీ నేత ప్రీతి గాంధీ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

Kejriwal in Gujarat: మోదీ సొంత రాష్ట్రం

గుజరాత్ మోదీ సొంత రాష్ట్రం. ప్రధాని కాకముందు, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గుజరాత్ లో బీజేపీ గత 27 ఏళ్లుగా అధికారంలో ఉంది. అయితే, ఇటీవలి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో ఉత్సాహంలో ఉన్న ఆప్ గుజరాత్ ఎన్నికల్లోనూ ప్రతాపం చూపాలన్న ఆలోచనలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ.. గుజరాత్ లో ఆప్ కు విజయం దక్కలేదు. ఈ సారి ఎన్నికలను కేజ్రీవాల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై నెలకొన్న వ్యతిరేకత తనకు లాభిస్తుందని ఆయన భావిస్తున్నారు. గుజరాత్ లో బీజేపీ అసమర్ద పాలనకు అంతం పలకాలని, ఆప్ ను గెలిపిస్తే.. ఢిల్లీ తరహ పాలనను గుజరాత్ లో ప్రవేశపెడ్తామని హామీ ఇస్తున్నారు.

తదుపరి వ్యాసం