తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Idbi So Recruitment 2023: ఐడీబీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ

IDBI SO recruitment 2023: ఐడీబీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ

HT Telugu Desk HT Telugu

21 February 2023, 10:15 IST

    • IDBI SO recruitment 2023: ఐడీబీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ఐడీబీఐ బ్యాంక్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుల ప్రక్రియ నేడు ప్రారంభమైంది. దరఖాస్తుల సమర్పణకు మార్చి 3వ తేదీ గడువు. ఆసక్తి గల అభ్యర్థులు ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐడీబీఐ ఎస్‌ఓ రిక్రూట్మెంట్ వివరాలు

మొత్తం 144 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో 75 మేనేజర్ పోస్టులు, 29 అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులు, 10 డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు రుసుం

ఐడీబీఐ ఎస్‌ఓ రిక్రూట్మెంట్ 2023 దరఖాస్తు రుసుముగా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే దరఖాస్తు రుసుముగా రూ. 200 చెల్లించాలి.

IDBI SO recruitment 2023: దరఖాస్తు ఇలా

అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ సందర్శించాలి. హోం పేజీలో కెరీర్ ట్యాబ్ క్లిక్ చేయాలి. అక్కడ ఎస్‌ఓ రిక్రూట్మెంట్ అని కనిపించే చోట లింక్ క్లిక్ చేయాలి. దరఖాస్తు ఫారం నింపి, దరఖాస్తు రుసుము చెల్లించాలి. అవసరమైన డాక్యుమెంట్లు సబ్‌మిట్ చేయాలి. భవిష్యత్తు అవసరాల కోసం ఒక ప్రింటవుట్ తీసిపెట్టుకోండి.

టాపిక్

తదుపరి వ్యాసం