తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Big Blow To Russia: ఉక్రెయిన్ తో యుద్ధంలో రష్యాకు భారీ షాక్

Big blow to Russia: ఉక్రెయిన్ తో యుద్ధంలో రష్యాకు భారీ షాక్

HT Telugu Desk HT Telugu

08 October 2022, 14:57 IST

  • Big blow to Russia: రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ రష్యాకు భారీ షాక్ ఇచ్చింది. క్రిమియా, రష్యాలను కలిపే కీలక బ్రిడ్జిని పేల్చేసింది. 

పేలుడు జరిగిన రష్యా, క్రిమియాలను కలిపే బ్రిడ్జ్
పేలుడు జరిగిన రష్యా, క్రిమియాలను కలిపే బ్రిడ్జ్ (Twitter)

పేలుడు జరిగిన రష్యా, క్రిమియాలను కలిపే బ్రిడ్జ్

Big blow to Russia: రష్యా ఆక్రమణలో ఉన్న క్రిమియా భూభాగంతో రష్యాను కలిపే కీలక వంతెనపై భారీ పేలుడు సంభవించింది. దాంతో, ఆ వంతెన పాక్షకింగా కూలిపోయింది. అయితే, వాహనాల రాకపోకలకు అవసరమైన భాగం బాగానే ఉందని రష్యా వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

Big blow to Russia: ట్రక్ బాంబ్ తో..

రష్యా, క్రిమియాలను కలిపే కీలక బ్రిడ్జ్ పై ట్రక్ బాంబ్ పేలింది. దాంతో బ్రిడ్జ్ కు నిప్పంటుకుని, పాక్షికంగా కూలిపోయింది. అదే సమయంలో రష్యా సైనిక వాహనాలకు ఇంధనం తీసుకువెళ్తున్న రైల్వే వ్యాగన్లు కూడా వెళ్తుండడంతో పేలుడు తీవ్రత, మంటల తీవ్రత పెరిగింది. ఈ వంతెన ఉక్రెయిన్ తో యుద్ధంలో చాలా కీలకం. దక్షిణ ఉక్రెయిన్ లోని రష్యా బలగాలకు రష్యా నుంచి ఆయుధ వ్యవస్థలు, ఇతర నిత్యావసరాలు ఈ వంతెన నుంచే వెళ్తుంటాయి. ఈ వంతెన 19 కిమీల రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. దీనిని బ్లాక్ సీ ని సీ ఆఫ్ అజోవ్ ను కలుపే కెచ్ జలసంధిపై నిర్మించారు.

Big blow to Russia: రష్యాకు భారీ దెబ్బ

ఈ వంతెన కూలిపోవడం రష్యాకు భారీ దెబ్బ. రష్యా అధ్యక్షుడు పుతిన్ జన్మదినోత్సవాలు జరిగిన మర్నాడే ఈ రష్యా కు ఈ షాక్ తగలడం విశేషం. ఈ ఘటనను పుతిన్ సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. అయితే, ఈ పేలుడు కు ఉక్రెయినే కారణమని రష్యా కానీ, తామే ఆ బ్రిడ్జిని పేల్చేశామని ఉక్రెయిన్ కానీ ఇప్పటివరకు ప్రకటించలేదు.

తదుపరి వ్యాసం