తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  How To Detect Fake Job Offers?: ఫేక్ జాబ్ ఆఫర్లను గుర్తించడం ఎలా?

How to detect fake job offers?: ఫేక్ జాబ్ ఆఫర్లను గుర్తించడం ఎలా?

HT Telugu Desk HT Telugu

13 October 2022, 15:16 IST

    • How to detect fake job offers?: నిరుద్యోగుల ఆశలను సొమ్ము చేసుకునే దొంగలు చాలామందే ఉంటారు. జాబ్ ఆఫర్ల పేరుతో లక్షల్లో డబ్బు నొక్కేసే కేటుగాళ్లకు భారత్ లో కొదువ లేదు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Image by Adrian from Pixabay )

ప్రతీకాత్మక చిత్రం

How to detect fake job offers?: దేశంలో సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. వివిధ వినూత్న మార్గాల్లో సైబర్ నేరస్తులు ఆన్ లైన్ దోపిడీలకు పాల్పడుతున్నారు. అందులో ఒక రకం ఆన్ లైన్ జాబ్ ఆఫర్స్. ఉద్యోగం, మంచి జీతం ఇస్తామంటూ ఆన్ లైన్ లో చాలా మంది సంప్రదిస్తుంటారు. వారిలో మెజారిటీ ఫేక్ ఎంప్లాయర్లే. ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగాలంటూ నిరుద్యోగులను ఆకర్షించే ముఠాలు చాలా ఉన్నాయి. అయితే, నిజమైన జాబ్ ఆఫర్ ఏదో? ఫేక్ ఆఫర్ ఏదో తెలుసుకోవడం ఎలా?

ట్రెండింగ్ వార్తలు

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

Uber ride horror: కారులో ఉబర్ డ్రైవర్ హస్తప్రయోగం; భయాందోళనలకు గురైన మహిళ

How to detect fake job offers?: కేంద్ర హోం శాఖ సూచనలు

నిరుద్యోగులు ఇలా నకిలీ జాబ్ ఆఫర్ల వలలో పడకుండా ఉండడానికి కేంద్ర హోం శాఖ కొన్ని సూచనలు చేస్తోంది. ఆన్ లైన్ లో మీకేదైనా ఆఫర్ వస్తే.. ముందుగా, ఈ విషయాలు పరిశీలించండి అంటూ కొన్ని జాగ్రత్తలు చెబుతోంది. అవేంటంటే..

How to detect fake job offers?: ఈ ఐదు అంశాలను పరిశీలించండి..

కేంద్ర హోం శాఖ సూచించిన ఆ అంశాలు ఇవే..

  • పూర్తి స్థాయి వెరిఫికేషన్, ఇంటర్వ్యూ లేకుండానే, మొదటి సారి మాట్లాడిన వెంటనే మీకు కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వస్తే అనుమానించాల్సిందే.
  • మీకు వచ్చిన ఆఫర్ లెటర్ నిర్దిష్టంగా ఉందా? మీరు చేయాల్సిన జాబ్ వివరాలు స్పష్టంగా ఉన్నాయా? చూడండి. అస్పష్టమైన, సరైన నిర్దిష్టమైన జాబ్ వివరాలు లేని ఆఫర్ లెటర్స్ కచ్చితంగా నకిలీవే.
  • ఆఫర్ లెటర్లో ఉన్న భాషను పరిశీలించండి. ఫేక్ ఎంప్లాయర్ల నుంచి వచ్చే ఈ మెయిల్ లో భాష దారుణంగా, పలు తప్పులతో ఉంటుంది. వీలైతే, మీకు తెలిసిన మంచి కంపెనీ నుంచి వేరే ఎవరికైనా వచ్చిన ఆఫర్ లెటర్ తో పోల్చి చూడండి. తేడాగా ఉంటే, పక్కన పెట్టేయండి.
  • ఇంటర్వ్యూ సమయంలో ఈ ప్రైవేటు వివరాలు అడుగుతున్నారంటే, అది స్కామే అని నిర్ధారించుకోండి. మీ ప్రైవేటు వివరాలు, ముఖ్యంగా మీ ఆర్థిక స్థితిగతులు, బ్యాంక్ ఖాతాల వివరాలు అడిగితే.. అది కచ్చితంగా ఫేక్ కంపెనీయే. సైబర్ క్రైమ్ కు రిపోర్ట్ చేస్తామని హెచ్చరించండి.
  • ఇది చాలా ముఖ్యమైనది. ఏ కంపెనీ కూడా జాబ్ ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేయదు. ట్రైనింగ్ కోసమని, లేదా వేరే ఏదో కారణం చెప్పి మీ నుంచి డబ్బు అడుగుతున్నారంటే అది నకిలీ కంపెనీయే.
  • ఒకవేళ ఇప్పటికే ఇలాంటి నకిలీ జాబ్ ఆఫర్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్నారా? వెంటనే cybercrime.gov.in. లో ఫిర్యాదు చేయండి.

తదుపరి వ్యాసం