తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Dog Rescue | అగ్నిపర్వతం పగుళ్లలో ఇరుక్కున్న కుక్క.. చెమటోడ్చిన సాహసయాత్రికుడు

Dog Rescue | అగ్నిపర్వతం పగుళ్లలో ఇరుక్కున్న కుక్క.. చెమటోడ్చిన సాహసయాత్రికుడు

01 March 2022, 22:46 IST

    • అగ్ని పర్వతం పగుళ్ల మధ్య చిక్కుకున్న ఓ కుక్కను కాపాడేందుకు ప్రముఖ హవాయ్ అడ్వెంచర్ ట్రావెలర్ కవికా సింగ్సాన్ ప్రయత్నించాడు. దాన్ని సురక్షితంగా కాపాడేందుకు ఎంతగానో కష్టపడి చివరకు అనుకున్నది సాధించాడు.
ఇరుక్కున్న కుక్కను సురక్షితంగా బయటకు తీస్తున్న ట్రావెలర్
ఇరుక్కున్న కుక్కను సురక్షితంగా బయటకు తీస్తున్న ట్రావెలర్ (youtube)

ఇరుక్కున్న కుక్కను సురక్షితంగా బయటకు తీస్తున్న ట్రావెలర్

జంతువులకు, మానవులకు మధ్య సంబంధం ఈ నాటిది కాదు. మానవ నాగరికత ఆవిర్భావం నుంచి వీరిద్దరి మధ్య సంబంధం కొనసాగుతూనే ఉంటుంది. అందుకే కాబోలు.. ఎంతటి క్రూర మృగమైన ఆపదలో చిక్కుకుని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే.. ఆ దృశ్యాన్ని చూసిన వారి హృదయం జ్వలిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా పాడుబడ్డ బావుల్లో, దట్టమైన ముళ్ల కంపల్లో.. ఇలా ఏదైనా ఉచ్చులో ఇరుక్కుని ఉన్న జంతువులను చూస్తే ఎంతో జాలి కలుగుతుంది. వాటిని ఎలాగైన బయటకు తీయాలని పరితపిస్తుంటాం. ఇలాంటి ఎన్నో యానిమల్ రెస్క్యూ వీడియోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా అలాంటి రెస్కూ ఆపరేషన్ హవాయ్‌కు అడ్వెంచర్ యాత్రికుడు చేపట్టాడు. అగ్నిపర్వతం పగుళ్లలో ఇరుక్కున్న ఓ కుక్కను సురక్షితంగా బయటకు తీసి దాని ప్రాణాలను రక్షించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

వివరాల్లోకి వెళ్తే హవాయ్ ఫొటోగ్రాఫర్, అడ్వెంచర్ ట్రావెలర్ కవికా సింగ్సాన్ రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టడంలో సిద్ధ హస్తుడు. ఇప్పటికే లావా గక్కుతున్న అగ్నిపర్వతాల వద్ద ఫొటోలు తీసి ప్రాచుర్యం పొందాడు. ఇటీవలే ఆయన ఓ కుక్కను రెస్క్యూ చేశాడు. హిలో ద్వీపంలోని కిలాయుయా అగ్నిపర్వతం పగుళ్లలో ఓ కుక్క ఇరుక్కుపోయిందని, దాదాపు 25 అడుగుల లోతుల ఆ శునకం ప్రాణాలతో రెండు రోజుల పాటు పోరాడుతూ ఉందని సమాచారం అందుకున్నాడు కవికా.

వెంటనే అతడు తన బృందంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. సేఫ్టీ రోప్స్(Safety Ropes) సహాయంతో పగుళ్లను తగ్గించి శక్తికి మించి కష్టపడ్డాడు. చివరకు కొన్ని ప్రయత్నాల తర్వాత పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విషపు పొగలు చిమ్ముతున్న పగుళ్ల మధ్యకు చేరుకున్నాడు. అలా 25 అడుగుల లోతుకు వెళ్లి కుక్కను సేఫ్టీ రోప్‌కు తగిలించాడు. వెంటనే కుక్కను బయటకు లాగాలని వెలుపల ఉన్న తన బృందానికి చెప్పడంతో వారు ఆ శునకాన్ని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం అతడు కూడా ఎలాంటి సమస్య లేకుండా బయటపడ్డాడు. ఈ వీడియోను యూట్యూబ్‌లో అతడు షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

ఆనందకరమైన రీతిలో ముగిసిన ఈ ఘటనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. శునకాన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన కవికా సింగ్సాన్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ బయటకు సురక్షితంగా వచ్చిన ఈ శునకం పేరు మకా. చివరకు దీని యజమానితో దగ్గరకు తిరిగి చేరింది. అయితే ప్రపంచంలో అత్యంత యాక్టివ్‌గా ఉన్న అగ్నిపర్వాతాల్లో కిలోలాయుయా ఒకటి.

తదుపరి వ్యాసం