తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Govt Blocks Youtube Channels : యూట్యూబ్ చానెల్స్ పై వేటు

Govt blocks YouTube channels : యూట్యూబ్ చానెల్స్ పై వేటు

18 August 2022, 15:04 IST

  • Govt blocks YouTube channels : త‌ప్పుడు, అన‌వ‌స‌ర, అసంబ‌ద్ధ‌ సెన్సేష‌న‌ల్ థంబ్‌నెయిల్స్ వాడుతున్న 8 యూట్యూబ్ చానెల్స్‌ను ప్ర‌భుత్వం నిషేధించింది. వాటిలో పాకిస్తాన్ నుంచి నిర్వ‌హిస్తున్న ఒక యూట్యూబ్ చానెల్ కూడా ఉంది.

ప్ర‌తీకాత్మ‌క చిత్రం
ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Govt blocks YouTube channels : భార‌త జాతీయ భ‌ద్ర‌త‌పై తప్పుడు స‌మాచారాన్ని ప్ర‌సారం చేస్తున్న పాక్ యూట్యూబ్ చానెల్‌ను భార‌త ప్ర‌భుత్వం నిషేధించింది. Information Technology Rules-2021 ప్ర‌కారం ఈ చానెల్స్‌పై నిషేధం విధిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది.

Govt blocks YouTube channels : భార‌త వ్య‌తిరేక‌త‌

భార‌త దేశంపై, దేశ అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌పై విష‌పూరిత స‌మాచారాన్ని ప్ర‌చారం చేస్తున్న యూట్యూబ్ చానెల్స్‌ను భార‌త్ నిషేధించింది. భార‌త్ బ్లాక్ చేసిన ఈ యూట్యూబ్ చానెల్స్‌కు మొత్తంగా దాదాపు 114 కోట్ల వ్యూస్ ఉన్నాయి. అలాగే, 85.73 లక్ష‌ల స‌బ్‌స్క్రైబర్స్ ఉన్నారు. విష‌పూరిత‌, అబ‌ద్ధాల‌తో కూడిన స‌మాచారాన్ని ఇవి ప్ర‌సారం చేస్తున్న‌ట్లు కేంద్ర స‌మాచార ప్ర‌సార శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Govt blocks YouTube channels : ఇవే ఆ చానెల్స్‌..

ప్ర‌భుత్వం నిషేధించిన యూట్యూబ్ చానెల్స్‌లో లోక్‌తంత్ర టీవీ, యూ అండ్ వీ టీవీ, ఏఎం ర‌జ్వీ, గౌర‌వ్‌శాలి ప‌వ‌న్ మిథిలాంచ‌ల్‌, సీటాప్‌5టీహెచ్‌, స‌ర్కారీ అప్‌డేట్‌, స‌బ్‌కుచ్ దేఖో, న్యూస్ కీ దునియా ఉన్నాయి. ఇందులో న్యూస్ కీ దునియా పాకిస్తాన్ నుంచి ఆప‌రేట్ అవుతున్న చానెల్‌. భార‌త్ కు చెందిన యూట్యూబ్ చానెల్స్ త‌ప్పుడు, అసంబద్ధ థంబ్‌నెయిల్స్‌ను వాడుతున్నాయ‌ని, కొన్ని ప్ర‌ముఖ టీవీ చానెల్స్ లోగోల‌ను, ఆ చానెల్స్‌లో ప‌నిచేసే యాంక‌ర్ల ఫొటోల‌ను వాడుకుంటూ, త‌ప్పుడు వార్త‌ల‌ను నిజ‌మైన వార్త‌లుగా వీక్ష‌కులు భ్ర‌మ‌ప‌డేలా చేస్తున్నాయ‌ని ఐబీ శాఖ వివ‌రించింది. మ‌రోవైపు, పాక్ యూట్యూబ్ చానెల్‌లో భార‌త్‌లో హిందూయేత‌ర మ‌త‌ప‌ర‌మైన నిర్మాణాల‌ను కూల్చేస్తున్నార‌ని, వేరే మ‌తాల పండుగ‌ల‌ను నిషేధిస్తున్నార‌ని త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌సారం చేస్తున్నార‌ని వివ‌రించింది. ఇండియ‌న్ ఆర్మీపైన‌, జ‌మ్మూక‌శ్మీర్‌పైనా త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌సారం చేస్తున్నాయ‌ని తెలిపింది. గ‌త డిసెంబ‌ర్ నుంచి వంద‌కు పైగా యూట్యూబ్ చానెళ్ల‌ను కేంద్రం నిషేధించింది.

తదుపరి వ్యాసం