తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Girl Hangs Self: ఇంటి ఓనర్ లైంగిక వేధింపులు; బాలిక ఆత్మహత్య

Girl hangs self: ఇంటి ఓనర్ లైంగిక వేధింపులు; బాలిక ఆత్మహత్య

HT Telugu Desk HT Telugu

27 December 2022, 20:13 IST

  • Girl hangs self: 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. తాను అద్దెకుంటున్న గదిలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు దారి తీసింది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Girl hangs self: అద్దెకు ఉంటున్న గదిలో సీలింగ్ కు ఉరి వేసుకుని ఒక 16 ఏళ్ల బాలిక చనిపోయిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో జరిగింది. ఆ బాలిక అద్దెకు ఉంటున్న గది యజమాని లైంగికంగా వేధించడం వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకున్నదని ఆ బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

House owner molestation: ఇంటి ఓనర్ వేధింపులే కారణమా?

ఆ బాలిక గోరఖ్ పూర్ లో అద్దెకు ఉంటూ చదువుకుంటోంది. ఆమె తల్లిదండ్రులు కుషి నగర్ లో నివాసం ఉంటారు. సోమవారం ఆ బాలిక తన గదిలో ఉరి వేసుకుని చనిపోయింది. పోలీసులకు, ఆ బాలిక తల్లిదండ్రులకు ఆ ఇంటి యజమాని ఈ విషయమై సమాచారమిచ్చాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడికి చేరుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు ఇంటి యజమానిపై అనుమానం వ్యక్తం చేశారు. అతడు లైంగికంగా వేధించడం వల్లనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. పోలీసులు కూడా అతడికే సహకరిస్తున్నారని, తమ సంప్రదాయం ప్రకారం కాకుండా, వేరే సంప్రదాయంలో బలవంతంగా అంత్యక్రియలు చేసేలా ఒత్తిడి చేశారని ఆరోపించారు.

Girl hangs self in UP: స్థానికంగా ఉద్రిక్తత

ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు కారణమైంది. బాలిక తల్లిదండ్రులకు మద్దతుగా సమాజ్ వాదీ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. ధర్మ శాల మార్కెట్ ప్రాంతంలో స్థానికులు ధర్నా నిర్వహించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటి యజమానికి అదుపులోకి తీసుకున్నామని, అతడిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

తదుపరి వ్యాసం