తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పెర‌గ‌నున్న హోంలోన్‌, కార్ లోన్ ఈఎంఐలు

పెర‌గ‌నున్న హోంలోన్‌, కార్ లోన్ ఈఎంఐలు

HT Telugu Desk HT Telugu

04 May 2022, 20:23 IST

  • ఆర్బీఐ ప్ర‌క‌టించిన కీల‌క పాల‌సీ రేట్ల‌లో మార్పు రుణ గ్ర‌హీత‌ల జేబుల‌కు చిల్లులు పెట్టేలా ఉంది. రెపో రేట్‌, సీఆర్ఆర్‌ల‌ను పెంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణ‌యంతో గృహ రుణాలు, వాహ‌న రుణాల ఈఎంఐ లు పెరిగే అవ‌కాశ‌ముంది.

ఆర్బీఐ లోగో, ప‌క్క‌న సెక్యూరిటీ గార్డ్ నీడ‌(ఫైల్ ఫొటో)
ఆర్బీఐ లోగో, ప‌క్క‌న సెక్యూరిటీ గార్డ్ నీడ‌(ఫైల్ ఫొటో) (REUTERS)

ఆర్బీఐ లోగో, ప‌క్క‌న సెక్యూరిటీ గార్డ్ నీడ‌(ఫైల్ ఫొటో)

పాల‌సీ రేట్ల‌ను మారుస్తూ బుధ‌వారం ఆర్బీఐ అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యం ఒక‌వైపు స్టాక్ మార్కెట్‌ను కుదేలు చేసింది. మ‌రోవైపు, గృహ, వాహ‌న రుణాలు తీసుకున్న మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌పై నెల‌వారీ చెల్లింపుల‌(ఈఎంఐ) భారాన్ని పెంచ‌నుంది.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

రెపో, సీఆర్ఆర్‌ల పెంపు

ఆర్బీఐ రెగ్యుల‌ర్‌గా కీల‌క విధాన రేట్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌క‌టిస్తూ ఉంటుంది. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఈ రేట్ల‌ను స‌వ‌రిస్తూ ఉంటుంది. తాజాగా, రెపో రేట్‌ను 40 బేసిస్ పాయింట్ల‌ను పెంచుతూ బుధ‌వారం నిర్ణ‌యం తీసుకుంది. అలాగే, క్యాష్ రిజ‌ర్వ్ రేషియో(సీఆర్ఆర్)ను కూడా 50 బేసిస్ పాయింట్లు పెంచింది. తాజా పెంపుతో రెపో రేటు 4.40కి, సీఆర్ఆర్ 4.50కి పెరిగింది. 2018 ఆగ‌స్ట్ త‌రువాత ఆర్బీఐ రెపో, సీఆర్ఆర్‌ల‌ను పెంచ‌డం ఇదే ప్ర‌థ‌మం. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన మానెట‌రీ పాల‌సీ క‌మిటీ(ఎంపీసీ) స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌త మూడు నెల‌లుగా ద్ర‌వ్యోల్బ‌ణం ఆరు శాతం నుంచి త‌గ్గ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ద్ర‌వ్యోల్బ‌ణాన్ని క‌ట్ట‌డి చేయ‌డం కోసం ఆర్బీఐ ఈ నిర్ణ‌యం తీసుకుంది. సీఆర్ఆర్ ను పెంచ‌డం ద్వారా బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ నుంచి సుమారు రూ. 87 వేల కోట్ల రూపాయ‌ల‌ను బ‌య‌ట‌కు తేవ‌చ్చ‌ని ఆర్బీఐ అంచ‌నా వేస్తోంది. సీఆర్ఆర్ పెంపు ఈ మే 21 నుంచి అమ‌ల్లోకి వ‌స్తుంది. సీఆర్ఆర్ అంటే, బ్యాంకులు ఆర్బీఐ వ‌ద్ద క‌చ్చితంగా ఉంచాల్సిన‌ న‌గ‌దు నిల్వ రేటు.

ఎఫ్‌డీల‌కు గుడ్ న్యూస్

ఆర్బీఐ నుంచి తెచ్చుకున్న నిధుల‌కు బ్యాంకులు చెల్లించే వ‌డ్డీ రేటును రెపో(రీ ప‌ర్చేజింగ్ ఆప్ష‌న్‌) రేటు అంటారు. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని త‌గ్గించ‌డానికి ఈ రెపో రేటును ఆర్బీఐ కాలానుగుణంగా మారుస్తుంటుంది. రెపో రేటును ఆర్బీఐ త‌గ్గిస్తే.. ఆ మేర‌కు క‌మ‌ర్షియ‌ల్‌ బ్యాంకులు గృహ‌, వాహ‌న రుణ గ్ర‌హీత‌ల‌కు వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గిస్తాయి. అంటే, రెపో రేటు త‌గ్గితే, రుణాల వ‌డ్డీ.. త‌ద్వారా ఈఎంఐ త‌గ్గుతుంది. అదేవిధంగా, రెపో రేటు పెరిగితే, ఆ మేర‌కు బ్యాంకులు రుణాల వ‌డ్డీ రేట్ల‌ను పెంచుతాయి. దాంతో ఈఎంఐ పెరుగుతుంది. మ‌రోవైపు, రెపో రేటు పెంపు వ‌ల్ల బ్యాంకుల్లో సేవింగ్స్‌లో, ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో డ‌బ్బులు దాచుకున్న‌వారికి లాభం చేకూరుతుంది. వారి డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేటు పెరుగుతుంది.

తదుపరి వ్యాసం