తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Dawood Ibrahim|దావూద్‌కు లింకున్న మనీలాండరింగ్‌ కేసులో మహారాష్ట్ర మంత్రి అరెస్ట్

Dawood Ibrahim|దావూద్‌కు లింకున్న మనీలాండరింగ్‌ కేసులో మహారాష్ట్ర మంత్రి అరెస్ట్

HT Telugu Desk HT Telugu

23 February 2022, 15:51 IST

    • అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు లింకున్న మనీలాండరింగ్‌ కేసులో బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) మహారాష్ట్ర మంత్రి నవాజ్‌ మాలిక్‌ను అరెస్ట్‌ చేసింది.
మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ (ఫైల్ ఫొటో)
మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ (ఫైల్ ఫొటో) (HT_PRINT)

మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ (ఫైల్ ఫొటో)

ముంబై: ఈ కేసులో బుధవారం ఉదయం 8 గంటల నుంచీ ఈడీ.. ఎన్సీపీ నేత, మంత్రి అయిన నవాబ్‌ మాలిక్‌ను ప్రశ్నిస్తోంది. అండర్‌ వరల్డ్ డాన్ దావూద్‌ ఇబ్రహీం, అతని సోదరులు అనీస్‌, ఇక్బాల్‌, సహాయకుడు చోటా షకీల్‌లకు లింకున్న ఈ కేసులో ఈడీ నవాబ్‌ మాలిక్‌కు సమన్లు జారీ చేసింది. 

ట్రెండింగ్ వార్తలు

Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

దావూద్‌తోపాటు అండర్‌ వరల్డ్‌కు సంబంధించిన క్లూల కోసం గత వారం ముంబైలో పలుచోట్లు ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ మధ్యే నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ).. దావూద్‌ ఇబ్రహీంపై నమోదు చేసిన కేసును దృష్టిలో ఉంచుకొనే ఈ సోదాలు నిర్వహించింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. 

దావూద్‌ ఇబ్రహీం సహాయకుడు సర్దార్‌ షావలీ ఖాన్‌, దావూద్‌ సోదరి హసీనా పార్కర్‌ బాడీగార్డ్‌ సలీమ్‌ పటేల్‌లతో నవాబ్‌ మాలిక్‌ జరిపిన డీల్‌లకు సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ ఇద్దరి నుంచీ కోట్ల విలువ చేసే ప్రాపర్టీని నవాబ్‌ మాలిక్‌ కేవలం రూ.30 లక్షలకు కొనుగోలు చేసినట్లు ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆరోపిస్తున్నారు. 

దీంతోపాటు నవాబ్‌ మాలిక్‌ ఇతర వ్యాపార లావాదేవీలు, ఆయన సన్నిహితులపై కూడా ఈడీ ఓ కన్నేసి ఉంచింది. నవాబ్‌ మాలిక్‌కు వ్యతిరేకంగా ఈడీ దగ్గర సాక్ష్యం కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

తదుపరి వ్యాసం