తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delay: దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు రైళ్లు ఆలస్యం

Delay: దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు రైళ్లు ఆలస్యం

HT Telugu Desk HT Telugu

16 January 2024, 9:04 IST

  • ఢిల్లీ నుంచి దాదాపు 30 విమానాలు, 50 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇందిరా గాంధీ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు
ఇందిరా గాంధీ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు (HT_PRINT)

ఇందిరా గాంధీ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు

దట్టమైన పొగమంచు, విపరీతమైన చలితో ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా, వేలాది మంది విమాన, రైలు ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

Indian students: భారతీయ విద్యార్థులకు ‘డీపోర్టేషన్’ ముప్పు; భారీగా నిరసనలు

Patna crime news : స్కూల్​ డ్రైనేజ్​లో 4ఏళ్ల బాలుడి మృతదేహం.. నిరసనలతో తగలబడిన పాఠశాల!

JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకారం, నగరంలోని పాలం (విఐడిపి), సఫ్దర్జంగ్ విమానాశ్రయాలు ఉదయం 500 మీటర్ల లోపు విజిబిలిటీని నమోదు చేశాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజిఐఎ) నుండి బయలుదేరే సుమారు 30 విమానాలు ఆలస్యం అయ్యాయి.

దట్టమైన పొగమంచు మధ్య తక్కువ దృశ్యమానత కారణంగా 17 విమానాలు రద్దయ్యాయి. ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో పొగమంచు కనిపిస్తోందని, ఆయా రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్లో తక్కువ విజిబిలిటీ ప్రాంతాలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్ నుంచి ఈశాన్య భారతం, హర్యానా, ఉత్తర మధ్యప్రదేశ్, యూపీ, బీహార్, పశ్చిమబెంగాల్ మీదుగా ఉదయం 5.30 గంటలకు పొగమంచు కనిపిస్తోందని తెలిపింది.

విమానాలు ఆలస్యం కావడం, రద్దవడంతో ప్రయాణికులు విమానాశ్రయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల కొద్దీ ఆలస్యం అవుతుండడంతో ప్రయాణికుల్లో అసహనం పెరిగిపోతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సోమవారం ఢిల్లీ విమానాశ్రయంలో ఐదు విమానాలను దారి మళ్లించగా, 100కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి.

దేశ రాజధానిని దట్టమైన పొగమంచు చుట్టుముట్టడం, చలి తీవ్రత కారణంగా రాణి కమలాపతి- హజ్రత్ నిజాముద్దీన్ వందే భారత్, హౌరా-ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ సహా 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో పలువురు ప్రయాణికులు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో చిక్కుకుపోయారు.

మంగళవారం కనిష్ఠ ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, సోమవారం 3.3 డిగ్రీల కనిష్టానికి పడిపోయింది. మంగళ, బుధవారాల్లో ఐఎండీ ఢిల్లీపై ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో మరికొన్ని రోజుల పాటు చలిగాలులు, పొగమంచు కొనసాగే అవకాశం ఉందని అవగతమవుతోంది. రాజధాని నగరంలో సోమవారం 19.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

రానున్న 48 గంటల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా ఇదే రేంజ్‌లో నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త కుల్దీప్ శ్రీవాస్తవ తెలిపారు.

చలి తీవ్రత కొనసాగేందుకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామన్నారు. తెల్లవారు జామున దట్టమైన పొగమంచు కనిపిస్తూనే ఉంటుందని, ఇది విమానాలు, రైళ్లు, రోడ్డు ప్రయాణాలపై ప్రభావం చూపుతుందని తెలిపారు.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) ప్రకారం ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యూఐ) 401 గా నమోదైంది. కాలుష్య స్థాయిలను నియంత్రించడానికి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జిఆర్ఎపి) కింద స్టేజ్ 3 చర్యలను కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సిఎక్యూఎం) ఆదివారం ప్రయోగించింది.

రాజస్థాన్లోని శ్రీ గంగానగర్, పాటియాలా, అంబాలా, చండీగఢ్, పాలం, సఫ్దర్జంగ్ (న్యూఢిల్లీ), బరేలీ, లక్నో, బహ్రైచ్, వారణాసి, ప్రయాగ్రాజ్, తేజ్పూర్లలో ఈ శీతాకాలంలో తొలిసారిగా విజిబిలిటీ 'సున్నా'గా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. (ఏజెన్సీల సమాచారంతో)

టాపిక్

తదుపరి వ్యాసం