తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cabinet Reshuffle Buzz: త్వరలో మంత్రివర్గ విస్తరణ

Cabinet reshuffle buzz: త్వరలో మంత్రివర్గ విస్తరణ

HT Telugu Desk HT Telugu

11 January 2023, 21:06 IST

  • Cabinet reshuffle buzz: 2023 సంవత్సరంలో పలు కర్నాటక సహా పలు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో త్వరలో ప్రధాని మోదీ (PM Modi) కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

ప్రతీకాత్మక చిత్రం

జనవరి 16, 17 తేదీల్లో బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ భేటీ (BJP national executive meet) జరగనుంది. పార్టీ అగ్రనేతలు పాల్గొనే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి వరుడి కోసం వెతుకుతున్న కుటుంబం

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

Cabinet reshuffle buzz: కేంద్ర మంత్రివర్గ విస్తరణ

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరున ప్రారంభమవుతున్నాయి. సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ప్రధాని మోదీ (PM Modi) మంత్రివర్గ విస్తరణ (Cabinet reshuffle) చేపట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మంత్రుల పనితీరును బట్టి కొందరు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శివసేన, జనతాదళ్ యూ పార్టీలు కూటమి నుంచి వైదొలగినందువల్ల, ఆయా పార్టీల సభ్యులు నిర్వహించిన శాఖల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. దాంతో పాటు, కొన్ని శాఖల్లో మార్పుచేర్పులకు (Cabinet reshuffle) కూడా అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Cabinet reshuffle buzz: మహారాష్ట్ర నుంచి..

మహారాష్ట్రలో అధికార శివసేన ను చీల్చి, ఉద్ధవ్ ఠాక్రేను పదవి నుంచి దింపడంలో కీలకపాత్ర పోషించిన, ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క సారి మాత్రమే తన మంత్రివర్గంలో ప్రధాని మోదీ (PM Modi) మార్పులు చేశారు. జులై 2021లో అనూహ్య మార్పులతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (Cabinet reshuffle) చేపట్టారు. తాజాగా, చేపట్టనున్న విస్తరణలోనూ కొందరిని మంత్రి పదవి నుంచి తొలగించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని, మరి కొందరిని పార్టీ నుంచి మంత్రివర్గంలోకి తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు, మిత్రపక్షం నుంచి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ కు మంత్రివర్గంలో అవకాశం కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జావదేకర్ లను తొలగించి, మాజీ ఐఏఎస్ అధికారి అశ్వని వైష్ణవ్ కు రైల్వే, ఐటీ వంటి కీలక శాఖలు అప్పగించినట్లుగా.. ఈ సారి కూడా Cabinet reshuffle కొన్ని అనూహ్య నిర్ణయాలు ఉండొచ్చని భావిస్తున్నారు.

BJP national executive meet: కార్యవర్గ భేటీలో..

ఈ నెల 16, 17 తేదీల్లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో (BJP national executive meet) అనేక కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా పదవీ కాలం ముగియనున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda)ను కొనసాగించే విషయంపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. 2024 లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు నడ్డాను (JP Nadda) కొనసాగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం, హిమాచల్, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పరాజయం.. నేపథ్యంలో ఆయా ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలపై కార్యవర్గ సమావేశాల్లో (BJP national executive meet) పోస్ట్ మార్టం జరగనుంది. అలాగే, 2024 లోక్ సభ (2024 loksabha elections) ఎన్నికల కన్నా ముందు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు (assembly elections) సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం. ముఖ్యంగా రాజస్తాన్, కర్నాటక, చత్తీస్ గఢ్ ఎన్నికలపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు.

తదుపరి వ్యాసం