తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bsf Hc Results: బీఎస్ఎఫ్ లో కానిస్టేబుల్ పోస్ట్ పరీక్ష ఫలితాల వెల్లడి

BSF HC Results: బీఎస్ఎఫ్ లో కానిస్టేబుల్ పోస్ట్ పరీక్ష ఫలితాల వెల్లడి

HT Telugu Desk HT Telugu

12 April 2023, 19:22 IST

    • బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (Border Security Force BSF) లో హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ లకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. 
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (Border Security Force BSF) లో హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ లకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ రిజల్ట్ ను బీఎస్ఎఫ్ అధికారిక వెబ్ సైట్ bsf.gov.in. లో చెక్ చేసుకోవచ్చు. హెడ్ కానిస్టేబుల్ (RO), హెడ్ కానిస్టేబుల్ (RM) పోస్ట్ ల భర్తీకి బీఎస్ఎఫ్ 2022 నవంబర్ 20న రాత పరీక్ష నిర్వహించింది. అనంతరం శారీరక దారుఢ్య పరీక్షలను నిర్వహించింది. డాక్యుమెంటేషన్, పీఎస్టీ, పీఈటీ, డిక్టేషన్, పేరాగ్రాఫ్ రీడింగ్, తదితర పరీక్షలను జనవరి 16వ తేదీన నిర్వహించారు. ఫిబ్రవరి 15 నుంచి అభ్యర్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. రాత పరీక్ష, PST/PET, మెడికల్ ఎగ్జామ్ ల ఆధారంగా షార్ట్ లిస్ట్ ను రూపొందించారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (Border Security Force) లో హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ ల రిక్రూట్మెంట్ ప్రక్రియ 2022 ఆగస్ట్ 20న ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1312 హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి వరుడి కోసం వెతుకుతున్న కుటుంబం

How to check BSF Head Constable Final Result 2022: ఫలితాలను చెక్ చేసుకోవడం ఎలా?

బీఎస్ఎఫ్ లో హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ లకు నిర్వహించిన పరీక్ష ఫలితాలను తెలుసుకోవడం కోసం ముందుగా..

  • బీఎస్ఎఫ్ అధికారిక వెబ్ సైట్ bsf.gov.in. ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీ సెలక్షన్స్ లో రిజల్ట్స్ (results) లింక్ ను క్లిక్ చేయాలి. మరో పేజీ ఓపెన్ అవుతుంది.
  • అక్కడ కనిపించే BSF Head Constable Final Result 2022 లింక్ పై క్లిక్ చేయాలి.
  • కొత్త పీడీఎఫ్ (PDF) ఫైల్ ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా రిజల్ట్ ను చెక్ చేసుకోవచ్చు.
  • రిజల్ట్ ను డౌన్ లోడ్ చేసుకుని భద్రపర్చుకోవాలి.

Direct link to check BSF Head Constable Final Result 2022

తదుపరి వ్యాసం