తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Boi Recruitment: బ్యాంక్ జాబ్స్ అభ్యర్థులకు శుభవార్త; 500 పీఓ పోస్ట్ ల భర్తీ

BOI recruitment: బ్యాంక్ జాబ్స్ అభ్యర్థులకు శుభవార్త; 500 పీఓ పోస్ట్ ల భర్తీ

HT Telugu Desk HT Telugu

11 February 2023, 21:49 IST

  • BOI recruitment: 500 ప్రొబేషనరీ ఆఫీసర్ (Probationary Officers) పోస్ట్ లను భర్తీ చేయడానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India BOI) నోటిఫికేషన్ జారీ చేసింది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

BOI recruitment 2023:ప్రొబేషనరీ ఆఫీసర్ (Probationary Officers PO) పోస్ట్ ల భర్తీకి బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India BOI) నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 500 ప్రొబేషనరీ ఆఫీసర్ (Probationary Officers PO) పోస్ట్ లను బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India BOI) భర్తీ చేయనుంది.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

BOI recruitment: బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ (Probationary Officers PO) లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India BOI) అధికారిక వెబ్ సైట్ bankofindia.co.in. ను సందర్శించాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి ఆఖరు తేదీ ఫిబ్రవరి 25.

BOI recruitment: నోటిఫికేషన్ వివరాలు..

ఈ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 500 ప్రొబేషనరీ ఆఫీసర్ (Probationary Officers PO) పోస్ట్ లను బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India BOI) భర్తీ చేయనుంది. వాటిలో 350 పోస్ట్ లు క్రెడిట్ ఆఫీసర్ (Credit Officer) పోస్ట్ లు కాగా, 150 పోస్ట్ లు ఐటీ ఆఫీసర్ (IT Officer) కేడర్ వి. ఇవి రెండు కూడా స్పెషలిస్ట్ ఆఫీసర్ స్ట్రీమ్ కిందకు వస్తాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు నిబంధనల మేరకు వయో పరిమితి సడలింపు ఉంటుంది. ఈ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ లకు అప్లై చేయడానికి రూ. 850 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 175 చెల్లిస్తే సరిపోతుంది.

BOI recruitment: అప్లై చేయడం ఎలా?

  • బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ bankofindia.co.in ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీపై ఉన్న career tab పై క్లిక్ చేయాలి.
  • అనంతరం, “Recruitment of Probationary in JMGS-I upon passing Post Graduate Diploma in Banking & Finance(PGDBF) Project No. 2022-23/3 Notice dated 01.02.2023” పై క్లిక్ చేయాలి.
  • ఈ - రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తరువాత, అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయాలి.
  • అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
  • ఆన్ లైన్ లోనే అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
  • అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీలను భద్రపర్చుకోవాలి.

Direct link to apply

తదుపరి వ్యాసం