తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bjp National Executive Meet: జేపీ నడ్డా పదవీ కాలం పొడగింపు?

BJP national executive meet: జేపీ నడ్డా పదవీ కాలం పొడగింపు?

HT Telugu Desk HT Telugu

03 January 2023, 23:07 IST

    • BJP national executive meet: బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉందని విశ్వసనీయ పార్టీ వర్గాలు తెలిపాయి.
బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

జనవరి 16, 17 తేదీల్లో ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి వరుడి కోసం వెతుకుతున్న కుటుంబం

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

Fact Check : 'ల్యాబ్​లో పిల్లలను నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు' అంటున్న ఈ వైరల్​ వీడియోలో నిజమెంత?

BJP national executive meet: రెండు రోజుల సమావేశాలు

పార్టీ సీనియర్ నాయకులు పాల్గొనే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డాను కొనసాగించే అంశంతో పాటు, ఈ సంవత్సరం జరగనున్న 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలకు పార్టీ సమాయత్తం కావడంపై కూడా లోతుగా చర్చించనున్నారు. బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితర అగ్ర నేతలు సభ్యులుగా ఉంటారు.

BJP national executive meet: నడ్డానే కొనసాగిస్తారా?

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం ఈ నెల 20వ తేదీతో ముగుస్తుంది. అంటే, జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగిన తరువాత మరో నాలుగు రోజులు మాత్రమే ఆయన అధ్యక్షుడిగా ఉంటారు. అందువల్ల ఈ లోపే, నడ్డా వారసుడిని నిర్ణయించాల్సి ఉంది. అందువల్ల జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నడ్డాను కొనసాగించడమా? లేక కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవడమా? అన్న విషయం తేలుతుంది. అయితే, జేపీ నడ్డాపై పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కావడం లేదు కనుక, ఆయననే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, నడ్డాను పూర్తిగా, అంటే మరో మూడేళ్ల పాటు కొనసాగిస్తారా? లేక, లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు మాత్రమే కొనసాగిస్తారా? అనే విషయంపై స్పష్టత లేదు.

BJP national executive meet: ఎన్నికలే ఎజెండా

జనవరి 16, 17 తేదీల్లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఎన్నికలే ప్రధాన ఎజెండా కానున్నట్లు సమాచారం. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ పనితీరుపై సమీక్ష జరుపుతారు. అలాగే, ఈ సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను, ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిని చర్చిస్తారు. లోక్ సభ ఎన్నికలకు శ్రేణులను సమాయత్తపరిచే కార్యక్రమాలపై చర్చిస్తారు. అలాగే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర, విపక్షాల ఐక్య కూటమి సాధ్యాసాధ్యాలపై కూలంకశంగా చర్చించనున్నారు.

తదుపరి వ్యాసం