తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bitcoin Price : బిట్‌కాయిన్ ధర 20,289 డాలర్లకు పతనం

Bitcoin price : బిట్‌కాయిన్ ధర 20,289 డాలర్లకు పతనం

15 June 2022, 14:45 IST

    • లండన్, జూన్ 15: బిట్‌కాయిన్ విలువ బుధవారం 18 నెలల కనిష్టానికి పతనమైంది. చిన్న చిన్న క్రిప్టో కరెన్సీలను మరింత కిందికి లాగింది. క్రిప్టో లెండర్ సెల్సియస్ తమ ఖాతాదారుల విత్‌డ్రాయల్స్‌ను స్తంభింపజేయడంతో మొత్తం క్రిప్టో మార్కెట్ షేక్ అవుతోంది.
బిట్‌కాయిన్ భారీ పతనం.. 69 వేల డాలర్ల నుంచి 20,289 డాలర్లకు పడిపోయింది.
బిట్‌కాయిన్ భారీ పతనం.. 69 వేల డాలర్ల నుంచి 20,289 డాలర్లకు పడిపోయింది. (REUTERS)

బిట్‌కాయిన్ భారీ పతనం.. 69 వేల డాలర్ల నుంచి 20,289 డాలర్లకు పడిపోయింది.

క్రిప్టో కరెన్సీల్లో అతి పెద్దదైన బిట్‌కాయిన్ బుధవారం మరో 7.8 శాతం పడిపోయి 20,289 డాలర్లకు పతనమైంది. డిసెంబరు 2020 నుంచి ఇదే అత్యంత కనిష్టం కావడం గమనార్హం. శుక్రవారం నుంచి 28 శాతం నష్టపోయింది. ఈ ఏడాదిలో దాని విలువ సగానికి పడిపోయింది. నవంబరు 2021లో 69 వేల డాలర్లు ఉన్న బిట్ కాయిన్ విలువ మొత్తంగా చూస్తే గరిష్టం నుంచి 70 శాతం కోల్పోయింది.

క్రిప్టోలు డిపాజిట్ చేయించుకుని అత్యధిక రాబడుల ఆశచూపిన సెల్సియస్ తన ఖాతాదారుల నిల్వలను ఉపసంహరించుకోవడానికి గానీ, బదిలీ చేసుకునేందుకు గానీ వీల్లేదంటూ తాఖీదు జారీ చేయడంతో డిజిటల్ అసెట్స్ మార్కెట్లు షేక్ అయ్యాయి. కొద్దిరోజుల క్రితమే టెర్రా యూఎస్‌డీ, లూనా టోకెన్స్ సంస్థలు చేతులెత్తేయడంతో ఆ భయాందోళన తాజా సెల్సియస్ ఉదంతంతో  మరింత పెరిగిపోయింది.

ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్భణం రికార్డు స్థాయిలో పెరగడంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను బాగా పెంచుతుందన్న అంచనాలు కూడా క్రిప్టోకరెన్సీ, ఇతర రిస్కీ స్టాక్స్‌పై ఒత్తిడి పెంచాయి.

డిజిటల్ అసెట్ మేనేజర్ కాయిన్‌షేర్స్ తెలిపిన వివరాల ప్రకారం గత వారం 102 మిలియన్ డాలర్ల మేర క్రిప్టో ఫండ్స్ తరలిపోయాయని, యూఎస్ సెంట్రల్ బ్యాంక్ పాలసీ మరింత కఠినమవుతుందని ఇన్వెస్టర్లు భావించడం ఇందుకు కారణమని వివరించింది. అంతర్జాతీయంగా క్రిప్టో మార్కెట్ విలువ 900 బిలియన్ డాలర్లకు పడిపోయిందని ‘కాయిన్‌మార్కెట్’ డేటా చెబుతోంది. నవంబరులో ఈ విలువ 2.97 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

‘మార్కెట్లు ఆటుపోట్లు ఇంకా తగ్గలేదు..’ అని హాంగ్‌కాంగ్‌కు చెందిన ఆక్జియన్ గ్లోబల్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ డైరెక్టర్ స్కాటీ సూ తెలిపారు. ‘దురదృష్టవశాత్తూ ఇంకా ఈ పరిస్థితి కొనసాగుతుందని విశ్విస్తున్నాం.. గేమ్ ఇంకా ముగియలేదు..’ అని వ్యాఖ్యానించారు.

బిట్‌కాయిన్ పతనాన్ని అనుసరిస్తూ చిన్న క్రిప్టో కరెన్సీలు కూడా పతనమవుతూ వస్తున్నాయి. రెండో అతిపెద్ద టోకెన్ అయిన ఈథర్ 12 శాతం పడిపోయి 1,045 డాలర్లకు పతనమైంది. దాదాపు 12 శాతం పడిపోయింది. 15 నెలల కనిష్టానికి చేరింది.

ఇక సెల్సియస్ ఇన్వెస్టర్లకు సానుకూల ఫైనాన్సింగ్ ఆప్షన్లు ఇచ్చేందుకు పరిశీలిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. సంస్థ పునర్నిర్మాణానికి గల వ్యూహాత్మక ప్రత్యామ్నాయాలను కూడా వెతుకుతోందని తెలిపింది.

తదుపరి వ్యాసం