తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bitcoin: బిట్‌కాయిన్ 10 వేల డాలర్లకు పడిపోనుందా?

Bitcoin: బిట్‌కాయిన్ 10 వేల డాలర్లకు పడిపోనుందా?

HT Telugu Desk HT Telugu

11 July 2022, 12:28 IST

    • Bitcoin: బిట్‌కాయిన్ బుల్స్ జాగ్రత్త. క్రిప్టోకరెన్సీ క్రాష్ చాలా అధ్వాన్నంగా ఉంటుందని వాల్ స్ట్రీట్ అంచనా వేస్తోంది.
క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్
క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ (REUTERS)

క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్

Bitcoin: తాజా ఎంలైవ్ పల్స్ సర్వేలో ప్రతిస్పందించిన 950 మంది పెట్టుబడిదారులలో 60% మంది.. బిట్‌కాయిన్ టోకెన్ 30,000 డాలర్లకు చేరుకోవడం కంటే ముందు.. దాని ప్రస్తుత విలువలో సగానికి తగ్గి 10,000 డాలర్లకు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే నలభై శాతం మంది ఇందుకు భిన్నంగా స్పందించారు. లండన్‌లో సోమవారం ఉదయం బిట్‌కాయిన్ 2.8% తగ్గి 20,390 డాలర్లకు పతనమైంది.

సమస్యాత్మక రుణదాతలు, కుప్పకూలిన కరెన్సీల మధ్య ఆర్థిక మార్కెట్లలో సులువుగా డబ్బు సంపాదించవచ్చన్న స్పెక్యులేషన్‌కు ముగింపు పలుకుతూ క్రిప్టో పరిశ్రమ కుప్పకూలుతోంది.

CoinGecko సంకలనం చేసిన డేటా ప్రకారం.. గత సంవత్సరం చివరి నుండి క్రిప్టోకరెన్సీల మార్కెట్ విలువలో దాదాపు 2 ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది.

కాగా రిటైల్ ఇన్వెస్టర్లు క్రిప్టోకరెన్సీల గురించి ఎక్కువగా భయపడుతున్నారు. దాదాపు నాలుగో వంతు మంది ఈ అసెట్ క్లాస్‌ను చెత్తదిగా ప్రకటించారు. అయితే ప్రొఫెషనల్ ఇన్వెస్టర్లు డిజిటల్ ఆస్తుల పట్ల మరింత ఓపెన్ మైండెడ్‌గా ఉన్నారు.

స్పందించిన వారిలో 28% మంది క్రిప్టోకరెన్సీలు ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు అని బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేయగా, 20% మంది అవి పనికిరానివని చెప్పారు.

బిట్‌కాయిన్ నవంబర్‌లో దాదాపు 69,000 డాలర్లను తాకినప్పటి నుండి దాని విలువలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ కోల్పోయింది.

క్రిప్టో క్రాష్ పరిశ్రమ నియంత్రణకు ప్రభుత్వాలపై మరింత ఒత్తిడిని తెచ్చే అవకాశం ఉంది. స్టేబుల్‌కాయిన్ టెర్రాయుఎస్‌డి, సెల్సియస్ నెట్‌వర్క్, బ్రోకర్ వాయేజర్ డిజిటల్ లిమిటెడ్ వంటి సమస్యాత్మక బ్రోకర్ల పతనం కారణంగా బాధితులుగా మిగిలిన ఇన్వెస్టర్లు ప్రభుత్వ జోక్యాన్ని స్వాగతించవచ్చు.

సెంట్రల్ బ్యాంకులు డిజిటల్ చెల్లింపుల కోసం తమ స్వంత డిజిటల్ కరెన్సీలను అభివృద్ధి చేయడాన్ని కూడా పరిశీలిస్తున్నాయి.

అయితే ఇటీవలి ప్రైస్ డ్రాప్ వల్ల కానీ, సెంట్రల్ బ్యాంకులు విసురుతున్న సవాళ్ల వల్ల కానీ క్రిప్టో పరిశ్రమకు వచ్చిన ముప్పేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బిట్‌కాయిన్, ఇథర్ క్రిప్టోకరెన్సీల్లోని ఒకటి రానున్న ఐదేళ్లలో డ్రైవింగ్ ఫోర్స్‌గా మారుతుందని పోల్‌లో పాల్గొన్న వాళ్లు అంచనా వేశారు.

బిట్‌కాయిన్ ఇప్పటికీ క్రిప్టోవర్స్‌లోని చాలా భాగాలకు శక్తినిస్తుండగా, ఇథీరియమ్ తన శక్తిని కోల్పోతోందని సీనియర్ మార్కెట్ అనలిస్ట్ ఈడీ మోయా తెలిపారు.

అయితే మార్కెట్‌లోని ఒక కేటగిరీపై మాత్రం విస్తృతస్థాయి ఏకాభిప్రాయం ఉంది. అదే నాన్ ఫంజిబుల్ టోకెన్స్. క్రిప్టో కరెన్సీ మార్కెట్లు బూమ్‌లో ఉన్నప్పుడు కొన్ని చిత్రాలు మిలియన్ డాలర్లు పలికిన సందర్భాల్లో ఎన్‌ఎఫ్‌టీలు ఆకర్షణీయంగా మారాయి. అయితే ఆయా చిత్రాలు కేవలం ఆర్ట్ ప్రాజెక్టులని, స్టేటస్ సింబల్స్ అని మెజారిటీ పోల్ పార్టిసిపెంట్స్ చెప్పగా, 9 శాతం మంది మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ అని చెప్పారు.

టాపిక్

తదుపరి వ్యాసం