తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Fake Cbse Result Circular: సీబీఎస్ఈ రిజల్ట్స్ గురించి ఫేక్ సర్క్యులర్ వైరల్

Fake CBSE result circular: సీబీఎస్ఈ రిజల్ట్స్ గురించి ఫేక్ సర్క్యులర్ వైరల్

HT Telugu Desk HT Telugu

10 May 2023, 15:41 IST

  • Fake CBSE result circular: సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్ష ఫలితాల గురించిన ఒక ఫేక్ సర్క్యులర్ ప్రస్తుతం ఇంటర్ నెట్ లో వైరల్ అవుతోంది. ఆ సర్క్యులర్ ను నమ్మవద్దని సీబీఎస్ఈ విద్యార్థులకు సూచిస్తోంది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Photo: HT)

ప్రతీకాత్మక చిత్రం

Fake CBSE result circular: చూడడానికి సీబీఎస్ఈ (CBSE) నే జారీ చేసిందేమో అనుకునేలా ఉన్న ఒక నకిలీ సర్క్యులర్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో విస్తృతంగా షేర్ అవుతోంది. మే 11వ తేదీన సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఎగ్జామ్ రిజల్ట్స్ (CBSE result) విడుదల అవుతాయని ఆ డాక్యుమెంట్లో ఉంది. మే 11 వ తేదీన సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్లో సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఎగ్జామ్ రిజల్ట్స్ అప్ లోడ్ చేస్తారని అందులో ఉంది. అలాగే, ఆ ఫలితాలను అన్ని సీబీఎస్ఈ పాఠశాలలకు ఈ మెయిల్ ద్వారా పంపిస్తారని అందులో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

Fake CBSE result circular: అది ఫేక్ సర్క్యులర్

మే 11వ తేదీన సీబీఎస్ఈ (CBSE) 10, 12 తరగతుల ఎగ్జామ్ రిజల్ట్స్ (CBSE result) విడుదల అవుతాయని చెబుతూ ఇంటర్నెట్లో విస్తృతంగా షేర్ అవుతున్న డాక్యుమెంట్ నకిలీదని, ఆ సర్క్యులర్ ను నమ్మవద్దని సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సాన్యమ్ భరధ్వాజ్ స్పష్టం చేశారు. ఆ డాక్యుమెంట్ లోని వివరాలను విశ్వసించవద్దని విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆయన సూచిస్తున్నారు.

Fake CBSE result circular: త్వరలోనే ఫలితాలు..

అయితే, సాధారణంగా మే 2 లేదా 3వ వారంలోనే 10, 12 తరగతుల ఎగ్జామ్ రిజల్ట్స్ (CBSE result) ను సీబీఎస్ఈ విడుదల చేస్తూ ఉంటుంది. ఈ సారి కూడా త్వరలోనే ఈ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, కచ్చితంగా ఏ రోజు ఆ ఫలితాలు (CBSE result) విడుదల అవుతాయన్న విషయం ఇంతవరకు సీబీఎస్ఈ నిర్ధారణగా ప్రకటించలేదు. ప్రభుత్వ డిజిలాకర్ (DIGILOCKER) సైట్ లోనూ ‘త్వరలోనే’ సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అవుతాయన్న సందేశం డిస్ ప్లే అవుతోంది. విద్యార్థులు విశ్వసనీయమైన న్యూస్ పోర్టల్స్ ను కానీ, సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ cbse.gov.in ను కానీ తరచుగా గమనించడం ద్వారా 10వ తరగతి, 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ను తెలుసుకోవచ్చు.

The fake circular claims results will be shared on May 11.
తదుపరి వ్యాసం