తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bank Of Baroda Recruitment: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ పోస్ట్ లు

Bank of Baroda Recruitment: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ పోస్ట్ లు

HT Telugu Desk HT Telugu

19 October 2022, 21:35 IST

    • Bank of Baroda Recruitment: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ పోస్ట్ లకు నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా లోగో
బ్యాంక్ ఆఫ్ బరోడా లోగో

బ్యాంక్ ఆఫ్ బరోడా లోగో

Bank of Baroda Recruitment: ప్రముఖ బ్యాంక్ ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’లో ఐటీ ప్రొఫెషనల్స్ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 10 కేటగిరీల్లో 60 పోస్ట్ లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

Bank of Baroda Recruitment: కాంట్రాక్ట్ జాబ్స్

ఈ జాబ్స్ కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. బ్యాంక్ ఆఫ్ బరోడాలోని ఐటీ డిపార్ట్ మెంట్లో ఈ ఖాళీలున్నాయి. అయితే, ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు. నిర్థీత కాలానికి, షరతులకు లోబడి, ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. 10 వేర్వేరు కేటగిరీల్లో 60 ఐటీ ప్రొఫెషనల్ పోస్ట్ లకు గానూ బ్యాంక్ ఆఫ్ బరోడా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Bank of Baroda Recruitment: వివరాలు..

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు Computer Science లేదా Information Technology లో B.E లేదా B.Tech పాసై ఉండాలి. బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ bankofbaroda.in లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు సాధారణ అభ్యర్థులకు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి రూ. 600. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు రూ. 100. అభ్యర్థులను మొదట వారి విద్యార్హతలు, మార్క్స్ ను బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం వారిని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు బ్యాంక్ వెబ్ సైట్ bankofbaroda.in ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి కరంట్ ఆపర్చునిటీస్ ను క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం