తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Assam Afspa News: ఆ వివాదాస్పద చట్టాన్ని త్వరలోనే సంపూర్ణంగా ఉపసంహరించనున్న అస్సాం

Assam AFSPA news: ఆ వివాదాస్పద చట్టాన్ని త్వరలోనే సంపూర్ణంగా ఉపసంహరించనున్న అస్సాం

HT Telugu Desk HT Telugu

15 August 2023, 19:16 IST

  • Assam AFSPA news: వివాదాస్పద ‘సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (Armed Forces Special Powers Act AFSPA)’ ను ఈ ఏడాది చివర్లోగా సంపూర్ణంగా ఉపసంహరిస్తామని అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. ప్రస్తుతం అస్సాంలోని 8 జిల్లాల్లో మాత్రమే ఆ చట్టం అమల్లో  ఉందన్నారు.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (HT_PRINT)

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ

Assam AFSPA news: వివాదాస్పద ‘సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (Armed Forces Special Powers Act AFSPA)’ ను ఈ ఏడాది చివర్లోగా సంపూర్ణంగా ఉపసంహరిస్తామని అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ () వెల్లడించారు. ప్రస్తుతం అస్సాంలోని 8 జిల్లాల్లో మాత్రమే ఆ చట్టం అమల్లో ఉందన్నారు. ప్రస్తుతం అస్సాంలో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

Fact Check : 'ల్యాబ్​లో పిల్లలను నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు' అంటున్న ఈ వైరల్​ వీడియోలో నిజమెంత?

Sushil Modi death : బీజేపీ సీనియర్​ నేత సుశీల్ కుమార్​​ మోదీ కన్నుమూత..

8 జిల్లాల్లోనే..

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మంగళవారం సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం పై కీలక ప్రకటన చేశారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జండా వందనం చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. 2023 చివరి నాటికి అస్సాం నుంచి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSPA) సంపూర్ణంగా ఉపసంహరిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం అస్సాంలో ఈ చట్టం 8 జిల్లాల్లో మాత్రమే అమల్లో ఉందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా జిల్లాల్లో ఈ చట్టాన్ని ఉపసంహరించామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ చట్టాన్ని కొనసాగించాలని గత ప్రభుత్వాలు దాదాపు 62 సార్లు కేంద్రాన్ని కోరాయని తెలిపారు.

అవినీతి రహిత ప్రభుత్వం

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు చాలా మెరుగయ్యాయని హిమంత బిశ్వ శర్మ తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 8 వేల మంది జనజీవన స్రవంతిలోకి, క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారన్నారు. అలాగే తిరుగుబాటు దళాలతో తమ ప్రభుత్వం నాలుగు శాంతి ఒప్పందాలు చేసుకుందని వెల్లడించారు. అస్సాం ని డ్రగ్స్ రహిత, అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం తన లక్ష్యమన్నారు. రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని తొలగించే దిశగా త్వరలో కఠిన చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తామన్నారు.

తదుపరి వ్యాసం