తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Award For Meritorious Students: 35 వేల మంది విద్యార్థులకు కానుకగా స్కూటర్లు

award for meritorious students: 35 వేల మంది విద్యార్థులకు కానుకగా స్కూటర్లు

HT Telugu Desk HT Telugu

20 October 2022, 9:40 IST

    • award for meritorious students: 35 వేల మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కూటర్లు బహుమతిగా ఇవ్వాలని అస్సోం ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కూటర్లు కానుకగా అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కూటర్లు కానుకగా అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం (HT_PRINT)

ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కూటర్లు కానుకగా అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్ర హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నిర్వహించిన 10+2 బోర్డ్ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన ప్రతిభావంతులైన బాలబాలికలకు 35,800 స్కూటర్లను అందజేయాలని అస్సోం మంత్రివర్గం బుధవారం నిర్ణయించింది.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రోనోజ్ పెగు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రభుత్వం గతంలోనే ఈ నిర్ణయం తీసుకుందని, దానికి కొనసాగింపుగా దీనిని అమలు చేస్తున్నామని తెలిపారు.

60 శాతం, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన 29,748 మంది బాలికలు స్కూటర్లను కానుకగా అందుకుంటారు. 75 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన 6,052 మంది బాలురు కూడా కానుకగా స్కూటర్లు పొందుతారు.

‘రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బాలికలను ప్రోత్సహించేందుకు స్కూటర్లను అందజేస్తోంది. ఈ సంవత్సరం అబ్బాయిలు కూడా స్కూటర్లను కానుకగా అందుకుంటారు. కానీ వారు సాధించిన మార్కులు 75 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి..’ అని పెగు చెప్పారు.

ఈ చర్య వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ. 259 కోట్ల భారం పడుతుంది. స్కూటర్లను కొనుగోలు చేసేందుకు టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామని, నవంబర్ 30 నుంచి విద్యార్థులకు అందజేస్తామని విద్యాశాఖ మంత్రి తెలిపారు.

స్కూటర్ల రిజిస్ట్రేషన్, వా బీమా కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది.

రాష్ట్రంలోని ప్రాంతీయ కళాశాలల్లో (రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్లు, సిబ్బందికి వేతనాలు చెల్లించే సంస్థలు) 135 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల వేతనాలను పెంచాలని కూడా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. .

రాష్ట్రంలో హై-ఎండ్ హోటళ్లను ప్రారంభించే ప్రభుత్వ చర్యలో భాగంగా, కజిరంగా నేషనల్ పార్క్ సమీపంలో హయత్ గ్రూప్ ద్వారా ఫైవ్ స్టార్ హోటల్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. హోటల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని అందిస్తుంది.

తదుపరి వ్యాసం