తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Asani Cyclone | ఇక్కడ భారీ వర్షాలు.. అక్కడ హీట్​వేవ్​..!

Asani cyclone | ఇక్కడ భారీ వర్షాలు.. అక్కడ హీట్​వేవ్​..!

HT Telugu Desk HT Telugu

10 May 2022, 6:59 IST

    • Asani cyclone update | ఒడిశా- ఆంధ్రప్రదేశ్​ మధ్య కేంద్రీకృతమైన అసని తుపానుతో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. కాగా.. అసని తుపాను బలహీనపడుతోందని వివరించింది. అదే సమయంలో ఉత్తర, వాయువ్య భారతంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని స్పష్టం చేసింది.
అసని తుపాను
అసని తుపాను (HT_PRINT)

అసని తుపాను

Asani cyclone update | అసని తుపాను ప్రభావంతో తీర్పు తీరంలో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. అదే సమయంలో వాయువ్య, ఉత్తర, సెంట్రల్​ ఇండియా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని హెచ్చరించింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

దూసుకొస్తున్న అసని..

అసని తుపాను.. మంగళవారం నాటికి మధ్య, వాయువ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ప్రస్తుతం గంటకు 120కి.మీల వేగంతో గాలులు వీస్తున్నట్టు పేర్కొంది. కాగా.. అసని తుపాను తీరాన్ని దాటే అవకాశం లేదని స్పష్టం చేసింది. కానీ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, భీకర గాలులు వీస్తాయని తెలిపింది.

Asani cyclone live | సోమవారం మధ్యాహ్నం నాటికి.. అసని తుపాను విశాఖపట్నానికి 450కిమీల దూరంలో, ఒడిశాలోని పూరికి 610కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

"అసని తుపాను వేగం తగ్గింది. ఫలితంగా.. మరో 24గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే.. తుపాను పరిస్థితి తీవ్రంగానే ఉంది. అండమాన్​ దీవుల్లో భారీ వర్షాలు కురిశాయి. కానీ ఒడిశాకు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు," అని ఐఎండీ పేర్కొంది.

కాగా తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్​లోని కోల్​కతా, హౌరా, పుర్వ మేదినిపూర్​, ఉత్తర-దక్షిణ 24 పర్గనాస్​ ప్రాంతాల్లో రానున్న 2-3రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అక్కడ హీట్​వేవ్​..

Heatwave in India 2022 | అసని తుపాను బలహీన పడే కొద్ది.. ఉత్తర, వాయువ్య భారతంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని ఐఎండీ వెల్లడించింది. ఫలితంగా పలు ప్రాంతాలకు హీట్​వేవ్​ హెచ్చరికలు జారీ చేసింది.

"రాజస్థాన్​లో సోమవారం నుంచి ఈ నెల 13 వరకు హీట్​వేవ్​ ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో.. 10-12వ తేదీ మధ్య భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక గుజరాత్​లో సోమ, మంగళవారాలు హీట్​వేవ్​ పరిస్థితులు ఉంటాయి. మహారాష్ట్ర విదర్భా, మధ్యప్రదేశ్​లో 9-13, దక్షిణ హరియాణా- దక్షిణ పంజాబ్​లో 10-13, ఢిల్లీలో 11-13 తేదీల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి," అని ఐఎండీ వివరించింది.

టాపిక్

తదుపరి వ్యాసం