తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  How To Hack Wifi Password : ఇతరుల వైఫై పాస్​వర్డ్​ తెలుసుకోవడం చాలా సింపుల్​!

How to hack WIFI password : ఇతరుల వైఫై పాస్​వర్డ్​ తెలుసుకోవడం చాలా సింపుల్​!

Sharath Chitturi HT Telugu

04 September 2022, 15:31 IST

    • How to hack WIFI password in telugu : మీరు ఇతరుల వైఫై పాస్​వర్డ్​ తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. చాలా సింపుల్​గా ఇతరుల వైఫై పాస్​వర్డ్​ తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే..
ఇతరుల వైఫై పాస్​వర్డ్​ హ్యాక్​ చేయడం చాలా సింపుల్​!
ఇతరుల వైఫై పాస్​వర్డ్​ హ్యాక్​ చేయడం చాలా సింపుల్​!

ఇతరుల వైఫై పాస్​వర్డ్​ హ్యాక్​ చేయడం చాలా సింపుల్​!

How to hack WIFI password in telugu : ఈ 'టెక్​' యుగంలో.. ఇంటర్నెట్​ లేనిదే దాదాపు ఏ పని కూడా జరగడం లేదు. మనిషి జీవితంలో ఇంటర్నెట్​ ఓ భాగమైపోయింది. ఇక ఇంట్లో ఉంటే.. 'వైఫై' కచ్చితంగా ఉండాల్సిందే. వైఫై లేదా ఇంటర్నెట్​ పనిచేయకపోతే.. మనిషి విలవిలలాడిపోతాడు. ఇది ఒక సమస్య అయితే.. కొందరు తమ వైఫై పాస్​వర్డ్​ని మర్చిపోతుంటారు. మర్చిపోయిన వైఫై పాస్​వర్డ్​ను తెలుసుకోవడం చాలా సింపుల్​!

ట్రెండింగ్ వార్తలు

Patna crime news : స్కూల్​ డ్రైనేజ్​లో 4ఏళ్ల బాలుడి మృతదేహం.. నిరసనలతో తగలబడిన పాఠశాల!

JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

మరోవైపు.. మీ ఇంట్లో వైఫై పని చేయకపోతే.. ఒక్కోసారి పక్కింటి వారిని వైఫై పాస్​వర్డ్​ అడిగి ఉంటారు. వారు.. మీకు చెప్పకుండా.. వైఫై పాస్​వర్డ్​ని టైప్​ చేసి ఉంటారు. ఆ వైఫ్​ పాస్​వర్డ్​ని తెలుసుకోవాలన్న కుతుహలం మీలో ఉండే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం! ఈ సింపుల్​ స్టెప్స్​ పాటిస్తే.. ఇతరుల వైఫై పాస్​వర్డ్​ తెలుసుకోవడం చాలా సింపుల్​ విషయం.

ఇతరుల వైఫై పాస్​వర్డ్​ తెలుసుకోవడం ఎలా?

  • WIFI password tricks : స్టెప్​ 1:- ముందుగా.. సెట్టింగ్స్​లోకి వెళ్లి వైఫ్​ ఆప్షన్​ మీద క్లిక్​ చేయాలి.
  • స్టెప్​ 2:- మీరు ఎవరి వైఫై పాస్​వర్డ్​ తెలుసుకోవాలని అనుకుంటున్నారో.. ఆ వైఫ్​తో కనెక్ట్​ అవ్వాలి.
  • స్టెప్​ 3:- ఆ తర్వాత 'ట్యాప్​ టు షేర్​' అనే ఆప్షన్​ కనిపిస్తుంది. దాని మీద క్లిక్​ చేయాలి.
  • స్టెప్​ 4:- అలా క్లిక్​ చేసిన తర్వాత.. ఒక క్యూఆర్​ కోడ్​ కనిపిస్తుంది. దానిని స్క్రీన్​ షాట్​ తీసుకోవాలి.
  • స్టెప్​ 5:- మీ ఫోన్​లో గూగుల్​ లెన్స్​ యాప్​ను ఓపెన్​ చేయండి. అప్లోడ్​ ఇమేజ్​ ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి.
  • స్టెప్​ 6:- స్క్రీన్​ షాట్​ను అప్లోడ్​ చేయండి.
  • స్టెప్​ 7:- ఆ స్క్రీన్​ షాట్​ను.. గూగుల్​ లెన్స్​ స్కాన్​ చేస్తుంది. యూజర్​ నేమ్​, పాస్​వర్డ్​ వంటి వివరాలు మీ స్క్రీన్​ మీద కనిపిస్తాయి.

ఈ విధంగా.. ఇతరుల వైఫై పాస్​వర్డ్​ తెలుసుకోవచ్చు. లేదా మీ వైఫ్​ పాస్​వర్డ్​ని మర్చిపోతే.. ఈ సింపుల్​ స్టెప్స్​తో తెలుసుకునే వీలు ఉంటుంది.

తదుపరి వ్యాసం