తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Akasa Air : ఆకాశ ఎయిర్ క్రూ యూనిఫామ్ ఫస్ట్ లుక్ ఇదిగో..

Akasa Air : ఆకాశ ఎయిర్ క్రూ యూనిఫామ్ ఫస్ట్ లుక్ ఇదిగో..

HT Telugu Desk HT Telugu

04 July 2022, 17:39 IST

  • Akasa Air : ఆకాశ ఎయిర్ తన ఫ్లైట్ క్రూ యూనిఫామ్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది.

ఆకాశ ఎయిర్ క్రూ యూనిఫామ్ ఫస్ట్ లుక్
ఆకాశ ఎయిర్ క్రూ యూనిఫామ్ ఫస్ట్ లుక్ (PTI)

ఆకాశ ఎయిర్ క్రూ యూనిఫామ్ ఫస్ట్ లుక్

ముంబై, జూలై 4: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మద్దతుతో వస్తోన్న ఎయర్ లైన్ సంస్థ ఆకాశ ఎయిర్ తన ఫ్లైట్ క్రూ యూనిఫామ్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. రానున్న కొన్ని వారాల్లోనే ఆకాశ ఎయిర్ విమానాలు గాల్లోకి ఎగురనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

Indian students: భారతీయ విద్యార్థులకు ‘డీపోర్టేషన్’ ముప్పు; భారీగా నిరసనలు

Patna crime news : స్కూల్​ డ్రైనేజ్​లో 4ఏళ్ల బాలుడి మృతదేహం.. నిరసనలతో తగలబడిన పాఠశాల!

JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

తొలిసారిగా బోయింగ్ 737 మాక్స్ ఎయిర్ క్రాఫ్ట్‌ను ఆకాశ ఎయిర్ జూన్ 21న రిసీవ్ చేసుకుంది. త్వరలోనే కమర్షియల్ ఆపరేషన్స్ కోసం ఎయిర్ ఆపరేటర్ పర్మిట్‌ కూడా తీసుకోనుంది.

<p>ఆకాశ ఎయిర్ సంస్థ కొనుగోలు చేసిన బోయింగ్ విమానం</p>

ఆకాశ ఎయిర్ యూనిఫాం సిబ్బంది బిజీ ఫ్లైట్ షెడ్యూల్‌లలో వారికి సౌకర్యాన్ని ఇచ్చేందుకు సాధ్యమైనంత ఉత్తమమైన స్ట్రెచ్‌ అందించడంపై దృష్టి పెట్టిందని సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

కస్టమ్ ట్రౌజర్‌లు, జాకెట్‌లను ప్రవేశపెట్టిన మొదటి భారతీయ విమానయాన సంస్థ ఇదేనని, విమాన సిబ్బంది ఎర్గోనామిక్స్, సౌందర్యం, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆకాశ ఎయిర్‌కు ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్యాబ్రిక్ (సముద్ర వ్యర్థాల నుండి సేకరించిన పెట్ బాటిల్ ప్లాస్టిక్‌తో రీసైకిల్ చేసిన పాలిస్టర్ ఫాబ్రిక్‌ను ఉపయోగించి), సౌకర్యవంతమైన స్నీకర్‌లను ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది.

‘మా ప్రయాణీకులందరికీ ఆత్మీయమైన, స్నేహపూర్వకమైన, సమర్థవంతమైన ఫ్లయింగ్ అనుభవాన్ని అందించడానికి తమ శక్తిని వినియోగించేందుకు మా బృందం కంఫర్ట్‌గా ఉండేలా, గర్వపడేలా యూనిఫామ్ రూపొందించాం..’ అని ఆకాశ ఎయిర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ మార్కెటింగ్ అధికారి బెల్సన్ కౌటిన్హో అన్నారు.

సిబ్బంది నిత్యం ప్రయాణాల్లో ఉండాల్సి వస్తున్నందున, ఎక్కువ గంటలు నిలబడి విధులు నిర్వర్తించాల్సి వస్తున్నందున తేలికగా ఉండే వెనీలా మూన్ స్నీకర్‌లను రూపొందించిందని, మెరుగైన సపోర్ట్ ఇచ్చేందుకు మడమ నుండి కాలి వరకు అదనపు కుషనింగ్‌ను కలిగి ఉంటుందని సంస్థ వివరించింది.

‘ఈ షూ డిజైన్‌ను షేర్ చేయడానికి మేం సంతోషిస్తున్నాం. ఇది సౌకర్యవంతమైన, జెండర్ న్యూట్రాలిటీ‌తో వస్తున్న సమకాలీన డిజైన్’ అని వెనిలా మూన్ వ్యవస్థాపకురాలు దీపికా మెహ్రా చెప్పారు.

ఢిల్లీకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ రాజేష్ ప్రతాప్ సింగ్ రూపొందించిన ఈ జాకెట్ భారతీయ బంద్‌గాలా నుండి స్ఫూర్తిని పొందింది.

‘ఈ యూనిఫాం శైలి ఆకాశ ఎయిర్ ప్రధాన విలువలను ప్రతిబింబిస్తాయి. కాన్సెప్ట్ నుంచి ఔట్ పుట్ వరకు ఈ డిజైన్‌లపై పని చేయడం అత్యంత ప్రత్యేకమైన, ఉత్తేజకరమైన ప్రయాణం..’ అని సింగ్ చెప్పారు.

గత నవంబర్‌లో ఆకాశ ఎయిర్ బోయింగ్ నుండి మ్యాక్స్ విమానాలను ఆర్డర్ చేస్తున్నట్లు ప్రకటించింది. 737 మ్యాక్స్ శ్రేణిలో రెండు వేరియంట్‌లు ఉన్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం