తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Akasa Air: ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ అందుకున్న ఆకాశ ఎయిర్.. ఇక ఎగరడమే తరువాయి

Akasa Air: ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ అందుకున్న ఆకాశ ఎయిర్.. ఇక ఎగరడమే తరువాయి

HT Telugu Desk HT Telugu

07 July 2022, 18:55 IST

    • Akasa Air: కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌కు ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ లభించంది.
73 Boeing 737MAX aircraftలతో సేవలు అందించనున్న ఆకాశ ఎయిర్.. తొలుత 2 సర్వీసులతో ఆకాశ ఎయిర్ విమానయాన సర్వీసులు ఈనెలలో ప్రారంభం కానున్నాయి.
73 Boeing 737MAX aircraftలతో సేవలు అందించనున్న ఆకాశ ఎయిర్.. తొలుత 2 సర్వీసులతో ఆకాశ ఎయిర్ విమానయాన సర్వీసులు ఈనెలలో ప్రారంభం కానున్నాయి. (PTI)

73 Boeing 737MAX aircraftలతో సేవలు అందించనున్న ఆకాశ ఎయిర్.. తొలుత 2 సర్వీసులతో ఆకాశ ఎయిర్ విమానయాన సర్వీసులు ఈనెలలో ప్రారంభం కానున్నాయి.

ముంబై, జూలై 7: ఆకాశ ఎయిర్ తమకు డీజీసీఏ నుంచి ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ (ఏఓసీ) లభించిందని, ఈ నెలలోనే కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించనున్నామని సంస్థ గురువారం ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

Uber ride horror: కారులో ఉబర్ డ్రైవర్ హస్తప్రయోగం; భయాందోళనలకు గురైన మహిళ

ఏయిర్‌లైన్ తమ కార్యరంగంలో సంసిద్ధంగా ఉండేందుకు అవసరమైన అన్ని రెగ్యులేటరీ ప్రక్రియలు సంతృప్తికరంగా పూర్తి చేస్తే ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ లభిస్తుందని ఆకాశ ఎయిర్ ఒక ప్రకటనలో తెలిపింది.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సూపర్‌విజన్‌లో ఆకాశ ఎయిర్ ప్రూవింగ్ ఫ్లైట్స్ ప్రక్రియ పూర్తయినట్టు తెలిపింది.

స్టాక్ మార్కెట్లో దిగ్గజ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా వెన్నుదన్నుగా ఉన్న ఈ ఆకాశ ఎయిర్ సంస్థ బోయింగ్ 737 మాక్స్ ఎయిర్ క్రాఫ్ట్‌ను ఇప్పటికే జూన్ 21న రిసీవ్ చేసుకుంది.

నిర్మాణాత్మక మార్గదర్శకత్వాన్ని అందించినందుకు పౌర విమానయాన సంస్థ, డీజీసీఏకు ఆకాశ ఎయిర్ ధన్యవాదాలు తెలిపింది. ఏఓసీ ప్రక్రియలో మద్దతు ఇచ్చినందుకు సంతోషం వ్యక్తంచేసింది. ఇక జూలై మాసంలోనే తమ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆకాశ ఎయిర్ ఫౌండర్, సీఈవో వినయ్ దూబే తెలిపారు.

ప్రభుత్వం డిజిటైజేషన్‌లో భాగంగా తెచ్చిన ఈజీసీఏ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారానే ఏఓసీ ప్రక్రియ మొత్తం పూర్తయిందని, డిజిటల్ ప్లాట్‌పామ్ ద్వారా మొత్తం ప్రక్రియ పూర్తవడం ఆకాశ ఎయిర్‌తోనే మొదలని తెలిపింది.

ముందుగా రెండు విమానాలతో ఆకాశ ఎయిర్ తన కార్యకలాపాలను ఈ నెలలోనే ప్రారంభించనుంది. ప్రతి నెలా కొన్ని ఫ్లైట్లను తన సర్వీసుల్లో జత చేస్తూ వెళుతుంది.

2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఎయిర్ లైన్ 18 ఎయిర్ క్రాఫ్ట్‌లు కలిగి ఉంటుంది. ఆ తరువాత ప్రతి 12 నెలల్లో 12 నుంచి 14 విమానాలను జత చేస్తుంది. ఇలా తన ఆర్డర్‌లో భాగంగా 5 ఏళ్లలో మొత్తం 72 ఎయిర్ క్రాఫ్టులను సమకూర్చుకుంటుంది.

గత నవంబరులో ఆకాశ ఎయిర్ 72 ఎయిర్ క్రాఫ్ట్‌ (బోయింగ్ 737 మాక్స్) లను బోయింగ్ నుంచి ఆర్డర్ చేసింది. 737 మ్యాక్స్‌కు చెందిన 737-8, 737-8-200 వెర్షన్ ఎయిర్ క్రాఫ్ట్‌లను ఆర్డర్ చేసింది.

టాపిక్

తదుపరి వ్యాసం