తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gold Seized At Mumbai Airport: ఒక్క రోజే 61 కేజీల బంగారం సీజ్.. విలువ ఎంతంటే!

Gold Seized at Mumbai Airport: ఒక్క రోజే 61 కేజీల బంగారం సీజ్.. విలువ ఎంతంటే!

13 November 2022, 22:55 IST

    • Gold Seized at Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో ఒక్క రోజులోనే అక్రమంగా తరలిస్తున్న 61కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Gold Seized at Mumbai Airport: ఒక్క రోజే 61 కేజీల బంగారం సీజ్
Gold Seized at Mumbai Airport: ఒక్క రోజే 61 కేజీల బంగారం సీజ్ (PTI)

Gold Seized at Mumbai Airport: ఒక్క రోజే 61 కేజీల బంగారం సీజ్

Gold Seized at Mumbai Airport: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక్క రోజే భారీ స్థాయిలో బంగారం పట్టుబడింది. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు శుక్రవారం ఒక్కరోజే 61 కిలోగ్రాముల (కేజీల) బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఈ పసిడిని సీజ్ చేశారు. ఈ మొత్తం బంగారం విలువ సుమారు రూ.32కోట్లుగా ఉంది. తమ డిపార్ట్మెంట్ ఒక్కరోజులోనే ఎయిర్ పోర్టులో ఇంత భారీ స్థాయిలో బంగారం సీజ్ చేయడం ఇదే తొలిసారి అని కస్టమ్స్ కు చెందిన ఓ అధికారి చెప్పారు. రెండు వేర్వేరు ఆపరేషన్లలో ఈ 61 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఏడుగురిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి వరుడి కోసం వెతుకుతున్న కుటుంబం

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

Gold Seized at Mumbai Airport: బెల్టుల్లో పెట్టుకొని..

టాంజేనియా నుంచి వచ్చిన నలుగురి వద్ద ముంబై ఎయిర్ పోర్టులో భారీగా బంగారాన్ని గుర్తించారు కస్టమ్స్ అధికారులు. చెరో కేజీ బరువు ఉండే 53 బంగారు బార్స్ (కడ్డీలు)ను స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారు కడ్డీలను ఆ నలుగురు భారతీయులు బెల్టుల్లో దాచుకొని తెచ్చారు. పసిడిని అక్రమంగా తరలించేందుకే ప్రత్యేకంగా పాకెట్లతో ఈ బెల్టులను రూపొందించారు. మొత్తంగా ఈ నలుగురి నుంచి రూ.28.17 కోట్ల విలువ చేసే 53కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. దోహా ఎయిర్ పోర్టులో సుడాన్ దేశస్థుడు వీరికి ఈ బెల్టులను అందించినట్టు వెల్లడించారు. ఖతార్ ఎయిర్ వేస్ విమానంలో వీరు ముంబైకి వచ్చారు. మొత్తంగా ఈ నలుగురు నిందితులకు 14 రోజులను విధించింది న్యాయస్థానం.

Gold Seized at Mumbai Airport: మైనంలా..

దుబాయ్ నుంచి విస్తారా విమానంలో వచ్చిన ముగ్గురు వ్యక్తుల (ఓ పురుషుడు, ఇద్దరు మహిళలు) వద్ద కూడా పసిడిని పట్టుకున్నారు అధికారులు. ఈ ముగ్గురి దగ్గరి నుంచి 8 కిలోల బంగారాన్ని శుక్రవారం పట్టుకున్నారు. సీజ్ చేసిన ఈ పసిడి విలువ రూ.3.88 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారం పొడిని మైనం రూపంలో అక్రమంగా ఆ ముగ్గురు తరలించేందుకు ప్రయత్నించారు. జీన్స్ లో దాచి బంగారాన్ని విమానాశ్రయం దాటించాలని అనుకున్నారు. అయితే కట్టుదిట్టంగా తనిఖీలు చేసిన అధికారులు ఆ బంగారాన్ని పట్టుకున్నారు. పట్టుబడిన ముగ్గురిలో ఓ మహిళ 60ఏళ్లు పైబడిన వారు. ఆమె చక్రాల కుర్చీలో వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.

టాపిక్

తదుపరి వ్యాసం