తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India Covid Cases: లక్షకు చేరువలో కరోనా యాక్టివ్ కేసులు

India Covid Cases: లక్షకు చేరువలో కరోనా యాక్టివ్ కేసులు

21 August 2022, 13:09 IST

  • Corona cases in India: దేశంలో కొత్తగా 11,539 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 43 మంది మృతి చెందారు. 

దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు

Today India Corona Cases: దేశంలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 11,539 మందికి కరోనా వైరస్‌ సోకింది. వైరస్ బారిన పడి మరో 43 మంది మృతి చెందారు.

ట్రెండింగ్ వార్తలు

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి వరుడి కోసం వెతుకుతున్న కుటుంబం

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

కొత్త కేసులు - 11,539

మరణాలు - 43

రికవరీ రేటు - 98.59 శాతం

యాక్టివ్ కేసుల శాతం - 0.23 శాతం

ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసులు - 99,879

మొత్తం కేసులు: 44,339,429

దేశంలో ఇప్పటి వరకు మొత్తం మరణాలు - 5,27,332

డైలీ పాజిటివిటీ రేటు - 3.75 శాతం

దేశంలో శనివారం 26,58,755 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,09,67,06,895కు చేరింది. ఒక్కరోజే 3,07,680 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు. ఇక కరోనా వైరస్ మరణాలు... అత్యధికంగా ఢిల్లీ, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్ నుంచి ఉన్నాయి.

తెలంగాణలో శనివారం కొత్తగా 357 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.31 లక్షలకు చేరింది. ఒక్కరోజులో 440 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.24 లక్షలకు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 2711 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం