తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Black Turmeric Benefits : ఎప్పుడైనా నల్ల పసుపు ఉపయోగించారా? బోలేడు ప్రయోజనాలు

Black Turmeric Benefits : ఎప్పుడైనా నల్ల పసుపు ఉపయోగించారా? బోలేడు ప్రయోజనాలు

HT Telugu Desk HT Telugu

03 September 2023, 18:00 IST

    • Black Turmeric Benefits : ఇప్పటి వరకు పసుపు రంగులో ఉన్న పసుపు గుణాల గురించి మాత్రమే విని ఉంటారు. పసుపు.. పసుపు రంగులో కాకుండా వేరే రంగులో ఉందా అని ఆలోచిస్తున్నారా? పసుపు కేవలం పసుపు రంగు మాత్రమే కాదు. నలుపు రంగులోనూ ఉంటుంది. దీనినే నల్ల పసుపు అంటారు. దానితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
నల్ల పసుపు
నల్ల పసుపు

నల్ల పసుపు

పసుపును ఆహారంలో కలిపినప్పుడు, దాని రంగు పసుపు రంగులోకి మారుతుంది. అదేవిధంగా నలుపు పసుపు(Black Turmeric)ను ఆహారం లేదా పాలలో కలిపినప్పుడు, ఊదా రంగులోకి మారుతుంది. నల్ల పసుపును సాధారణంగా భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, మధ్యప్రదేశ్‌లో పండిస్తారు. నల్ల పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయని అంటారు. దీని శాస్త్రీయ నామం కర్కుమా సీసియా. మణిపూర్, కొన్ని ఇతర రాష్ట్రాల్లోని గిరిజనుల వద్ద దొరుకుతాయి. నల్ల పుసుపు నుంచి తయారు చేసిన పేస్ట్ గాయాలపై, పాము, తేలు కాటులపై కూడా అప్లై చేస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

మైగ్రేన్‌తో బాధపడుతున్న వ్యక్తులు పెద్ద శబ్దాలు, లైట్ల విషయంలో సున్నితంగా ఉంటారు. నల్ల పసుపు దాని నుండి ఉపశమనాన్ని అందించడానికి పని చేస్తుంది. మైగ్రేన్ నుంచి ఉపశమనం కోసం, తాజా నల్ల పసుపును చూర్ణం చేసి, నుదుటిపై పేస్ట్ లాగా రాయండి.

నల్ల పసుపు గ్యాస్ట్రిక్ సమస్యల(Gastric Problems) నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్, ఉబ్బరం, ఎక్కిళ్ళు, అజీర్ణం, అల్సర్లు గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి బయటపడొచ్చు. నల్ల పసుపును ఆహారంతో లేదా నీటితో కలిపి తీసుకుంటే ఉపశమనం దొరుకుతుంది.

నల్ల పసుపును అద్భుతమైన నొప్పి నివారిణిగా పిలుస్తారు. నల్ల పసుపు పంటి నొప్పి, దద్దుర్లు, కడుపు సమస్యలు, ఆస్టియో ఆర్థరైటిస్ కోసం ఉపయోగిస్తారు. కానీ ఇది ఎల్లప్పుడూ మితంగా మాత్రమే తీసుకోవాలి.

నల్ల పసుపు రక్తంలో చక్కెర స్థాయిలను(Sugar Level) నియంత్రించడంలో సహాయపడుతుంది. సరైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది కాలేయ సమస్యల నుండి కూడా రక్షిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నల్ల పసుపు శరీర బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

ఇందులో ఆంథోసైనిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి దీని రంగు ముదురు ఊదా రంగులో ఉంటుంది. ఒకవైపు ఆంథోసైనిన్లు క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా అడ్డుకుంటే మరోవైపు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తి(Immunity)ని పెంచుతాయి.

శ్వాసకోశ వ్యాధులలో నల్ల పసుపు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జలుబు, దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. అంతే కాదు యాంటీ ఫంగల్, యాంటీ ఆస్తమా, యాంటీ ఆక్సిడెంట్, అనాల్జేసిక్, యాంటీ కన్వల్సెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ అల్సర్ వంటి ప్రత్యేక గుణాలు నల్ల పసుపులో ఉన్నాయి.

గమనిక : ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా కొత్తగా ప్రయత్నించేప్పుడు నిపుణుల సలహాను తీసుకోండి.

తదుపరి వ్యాసం