తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Xiaomi 12 Lite । భారీ 108 Mp కెమెరాతో షావోమి నుంచి సరికొత్త 5g స్మార్ట్‌ఫోన్‌!

Xiaomi 12 Lite । భారీ 108 MP కెమెరాతో షావోమి నుంచి సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌!

HT Telugu Desk HT Telugu

10 July 2022, 13:08 IST

    • షావోమి నుంచి Xiaomi 12 Lite పేరుతో ఒక సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ గ్లోబల్ మార్కెట్లో విడుదల అయింది. ఇందులో కెమెరా, ర్యామ్ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. ధర కూడా కాస్త ఎక్కువే ఉంది.
Xiaomi 12 Lite
Xiaomi 12 Lite

Xiaomi 12 Lite

స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు షావోమి తమ ఫ్లాగ్‌షిప్ 12S సిరీస్‌లో ఇటీవలే మూడు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇప్పుడు Xiaomi 12 Lite పేరుతో మరొక స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. ఇది 5G స్మార్ట్‌ఫోన్‌, గతంలో వచ్చిన షావోమి 11 లైట్ 5G NE స్మార్ట్‌ఫోన్‌కు అప్‌ గ్రేడెడ్ వెర్షన్. సరికొత్తగా వచ్చిన Xiaomi 12 Liteలోనూ కొన్ని అవే పాత ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇందులో భాగంగా HDR10+ డాల్బీ విజన్ సపోర్ట్‌తో 6.55 ”AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ అలాగే 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Dry Fruits For Skin : ఖరీదైన క్రీములు అవసరం లేదు.. డ్రైఫ్రూట్స్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి

Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు

IDIOT Syndrome : ఇంటర్నెట్‌లో ప్రతిదీ సెర్చ్ చేస్తే ఇడియట్.. ఈ రోగం ఉన్నట్టే!

Boti Masala Fry: బోటీ మసాలా ఫ్రై ఇలా చేస్తే బగారా రైస్‌తో జతగా అదిరిపోతుంది

ర్యామ్ స్టోరేజ్ ఆధారంగా ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుండగా, కలర్స్ పరంగా లైట్ గ్రీన్, లైట్ పింక్ , నలుపు రంగు ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

ఇంకా Xiaomi 12 Liteలో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత తదితర విషయాలను ఇక్కడ తెలుసుకోండి.

Xiaomi 12 Lite స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.55 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే
  • 6GB/8GB RAM, 128 GB/256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • Qualcomm స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్
  • వెనకవైపు 108 MP+8MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్
  • ముందు భాగంలో 32 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4300 mAh బ్యాటరీ సామర్థ్యం, 67W ఛార్జర్

6 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర, సుమారు రూ. 35,600/-

8 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర, సుమారు రూ. 39,600/-

కనెక్టివిటీపరంగా Xiaomi 12 Liteలో డ్యూయల్ 4G VoLTE, డ్యూయల్ 5G స్టాండ్‌బై, బ్లూటూత్ 5.2, GPS, USB టైప్-C, NFC ఉన్నాయి. ఈ ఫోన్ త్వరలో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

టాపిక్

తదుపరి వ్యాసం