తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Malala Day 2022 : మలాలా డే ఎందుకు చేస్తారో తెలుసా? ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిందే..

World Malala Day 2022 : మలాలా డే ఎందుకు చేస్తారో తెలుసా? ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిందే..

12 July 2022, 13:19 IST

    • World Malala Day 2022 : యువ కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం జూలై 12వ తేదీన అంతర్జాతీయ మలాలా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. స్త్రీ విద్య కోసం వాదిస్తున్న ఈ యువతికి గౌరవార్థం.. ఆమె పుట్టిన రోజున మలాలా దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి (UN) నిర్ణయించింది.
మలాలా దినోత్సవం 2022
మలాలా దినోత్సవం 2022

మలాలా దినోత్సవం 2022

World Malala Day 2022 : మలాలా యూసుఫ్‌జాయ్ పాకిస్థాన్‌లోని మింగోరాలో 1997లో జన్మించింది. ఆమె 2008లో మహిళా విద్య కోసం తన పోరాటాన్ని ప్రారంభించింది. బాలికలు విద్య అవసరమంటూ చాటి చెప్పేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆమెపై 2012లో తాలిబాన్లు దాడి చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Dry Fruits For Skin : ఖరీదైన క్రీములు అవసరం లేదు.. డ్రైఫ్రూట్స్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి

Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు

IDIOT Syndrome : ఇంటర్నెట్‌లో ప్రతిదీ సెర్చ్ చేస్తే ఇడియట్.. ఈ రోగం ఉన్నట్టే!

Boti Masala Fry: బోటీ మసాలా ఫ్రై ఇలా చేస్తే బగారా రైస్‌తో జతగా అదిరిపోతుంది

మాలాలా డే చరిత్ర

ఆ దాడి నుంచి కోలుకున్న అనంతరం జూలై 12, 2013న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మలాలా యూసఫ్‌జాయ్ తన ప్రసంగంతో అక్కడున్న వారిని కదిలించింది. ప్రతి బాలికకు విద్య అందాలనే ఆమె తపన చూసి.. అందరూ ప్రశంసించారు. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి వెంటనే ఆ యువ కార్యకర్తను గౌరవించటానికి ఆ రోజును 'మలాలా డే'గా నిర్వహిస్తామని ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మలాలా డేని జరుపుతున్నారు.

మాలాలా డే ప్రధాన లక్ష్యం..

ప్రతి ఆడపిల్లకు ఉచిత విద్యను అందించాలని ప్రపంచ నాయకులకు విజ్ఞప్తి చేసేందుకు ఈ రోజును ఓ అవకాశంగా ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు విద్యను పొందవలసిన అవసరాన్ని మలాలా ప్రపంచానికి ఎత్తి చూపింది. దానికి అనుగుణంగా ప్రపంచ నాయకులను వారి విధానాలను సంస్కరించుకోవాలని ఆమె తన ప్రసంగంలో తెలిపింది.

మరిన్ని..

స్త్రీ విద్య కోసం మలాలా చేస్తున్న కృషికి గుర్తుగా ఆమెకు నోబెల్ శాంతి బహుమతిని అందజేశారు. నోబెల్ బహుమతిని అందుకున్న అతిపిన్న వయస్కురాలిగా ఆమె రికార్డులకెక్కింది. 2015లో యూసుఫ్‌జాయ్ గౌరవార్థం ఒక గ్రహశకలానికి ఆమె పేరు పెట్టారు. 2018లో కార్యకర్త తత్వశాస్త్రం, ఆర్థికశాస్త్రం, రాజకీయాలను అధ్యయనం చేయడానికి ఆమె ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేరారు.

టాపిక్

తదుపరి వ్యాసం