తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Women Health: మహిళలకు మాత్రమే వచ్చే వ్యాధి ఇది, దీనికి చికిత్స కూడా లేదు

Women Health: మహిళలకు మాత్రమే వచ్చే వ్యాధి ఇది, దీనికి చికిత్స కూడా లేదు

Haritha Chappa HT Telugu

28 December 2023, 10:25 IST

    • Women Health: మహిళలకు మాత్రమే వచ్చే ఒక వ్యాధి ఎండోమెట్రియాసిస్. ఇంతవరకు దీనికి చికిత్స కనిపెట్టలేదు.
ఎండోమెట్రియాసిస్
ఎండోమెట్రియాసిస్ (pexels)

ఎండోమెట్రియాసిస్

Women Health: ప్రపంచంలో మహిళలకు మాత్రమే వచ్చే వ్యాధి ఒకటి ఉంది. అదే ఎండోమెట్రియాసిస్ (Endometriosis). ప్రపంచ జనాభాలో 10 శాతం మంది స్త్రీలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ వ్యాధికి సంబంధించిన వివరాలు వైద్యులకు కూడా తక్కువే తెలుసు. ఎంతోమంది వైద్యులకు ఈ వ్యాధి గురించి అవగాహన లేదు. ఇప్పటికీ దీనికి ఎలాంటి చికిత్సనూ కనిపెట్టలేదు. ఈ వ్యాధితో బాధపడుతూ ప్రతినెలా భయంకరమైన పీరియడ్స్ నొప్పిని భరిస్తున్న ఆడవాళ్లు ఎంతోమంది.

ట్రెండింగ్ వార్తలు

Ashwagandha powder: ప్రతిరోజూ అశ్వగంధ చూర్ణాన్ని ఇలా తీసుకోండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలే రావు

Ivy gourd and Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ దొండకాయలు తింటే చాలు, వాటితో ఎన్నో అద్భుత ప్రయోజనాలు

Gongura Chicken Pulao: స్పైసీగా గోంగూర చికెన్ పులావ్, దీన్ని తింటే మామూలుగా ఉండదు, రెసిపీ ఇదిగో

Quitting Job: మీరు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచి పెట్టేముందు ఈ విషయాలను గురించి ఆలోచించండి

పీరియడ్స్‌లో నొప్పి

కొందరికి పీరియడ్స్ సాఫీగా సాగుతాయి. మరికొందరికి తీవ్ర నొప్పిని కలిగిస్తాయి. ఇలా తీవ్ర నొప్పితో బాధపడుతున్న వారు ఆ నొప్పిని తక్కువ అంచనా వేయకూడదు. అది ఎండోమెట్రియాసిస్ వ్యాధి వల్ల రావచ్చు అని చెబుతున్నారు వైద్యులు. నెలసరి ఉన్నప్పుడే ఈ ఎండోమెట్రియాసిస్ లక్షణాలు కనిపిస్తాయి. ఇది కేవలం ఒక అవయవానికే పరిమితం కాదు, అక్కడి నుంచి ఇతర అవయవాలకూ పాకే అవకాశం ఉంది. కాబట్టి నెలసరి సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, నొప్పితో విలవిలాడుతున్నా, వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది.

వ్యాధి లక్షణాలు ఇవే

ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదిహేడున్నర కోట్ల మంది స్త్రీలు ఎండోమెట్రియోసిస్ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. ఒక్క అమెరికాలోనే ప్రతి పదిమంది మహిళల్లో ఒకరికి ఈ వ్యాధి ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఈ వ్యాధి ఉన్న మహిళల్లో నెలసరి సమయంలో విపరీతమైన పొట్టనొప్పి వస్తుంది. ముఖ్యంగా కటి భాగంలో ఈ నొప్పి మొదలవుతుంది. నెలసరి క్రమరహితంగా వస్తుంది. ప్రతినెలా పీరియడ్స్ రావు. రక్తస్రావం కూడా అధికంగా అవుతుంది. వక్షోజాల్లో నొప్పి రావడం, యూరిన్ ఇన్ఫెక్షన్, లైంగిక క్రియలో పాల్గొన్నప్పుడు తీవ్రంగా నొప్పి అనిపించడం, పొత్తికడుపులో నొప్పి రావడం వంటివన్నీ ఎండోమెట్రియాసిస్ లక్షణాలుగా చెప్పుకుంటారు.

చికిత్స లేదు

ఈ వ్యాధికి ఇంతవరకు ఎలాంటి చికిత్స లేదు. ఎండోమెట్రియాసిస్‌కు ఇచ్చే మందులు కూడా ఎక్కువగా గర్భనిరోధక మాత్రలే. ఎండోమెట్రియాసిస్ అదుపులో ఉంచేందుకు ఈస్ట్రోజన్ హార్మోన్ల ట్యాబ్లెట్లను వైద్యులు సూచిస్తారు. దీని వల్ల సైడ్ ఎఫెక్టులు ఎక్కువగానే ఉంటాయి. కొందరు వైద్యులు ఎండోమెట్రియాసిస్ నుంచి తప్పించుకోవడానికి గర్భం దాల్చమని మహిళలకు సూచన ఇస్తారు. అయితే గర్భం దాల్చిన తర్వాత ఆ 9 నెలలు మాత్రమే దీని బాధలు తగ్గుతాయి. ఆ తర్వాత మళ్లీ ఇది బాధించడం మొదలు పెడుతుంది. ఈ వ్యాధి నుంచి తప్పించుకోవడానికి గర్భసంచిని తీయించేసుకుంటున్నారు కొంతమంది. నిజానికి ఈ ఎండోమెట్రియాసిస్ అధికంగా గర్భసంచి వెలుపలే ప్రభావం చూపిస్తుంది. ఇతర అవయవాలకూ ఇది సోకే అవకాశం ఉంది.

ఎండోమెట్రియాసిస్ అనేది పీరియడ్స్ తో సంబంధం ఉన్న ఒక వ్యాధి. నిజానికి ఎండోమెట్రియోసిస్ పొర గర్భసంచి లోపల మాత్రమే ఉండాలి. ఇది గర్భసంచి వెలుపల, ఇతర అవయవాల్లో ఏర్పడడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. అంటే ఫిలోపియన్ ట్యూబ్స్ దగ్గర, కటి భాగంలో, పెద్ద పేగులు, చిన్న పేగులు, యోని ఇలా తదితర అవయవాల్లో ఎక్కడైనా ఈ పొర ఏర్పడితే అది వ్యాధిగా మారుతుంది. ఒక్కోసారి అరుదుగా ఊపిరితిత్తుల్లో, వెన్నెముకల్లో, మెదడులో, కళ్ళల్లో కూడా రావచ్చు. దీనివల్ల విపరీతమైన నొప్పులు భరించాల్సి వస్తుంది. నెలసరి సమయంలో తీవ్ర రక్తస్రావం అవుతుంది. ఇంతవరకు ఈ వ్యాధికి చికిత్స లేదు కాబట్టి ఎండోమెట్రియాసిస్ వస్తే జీవితాంతం భరించాల్సిందే.

టాపిక్

తదుపరి వ్యాసం