తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Relationships: అబ్బాయిల్లో ఈ లక్షణాలు ఉంటే... అమ్మాయిలు వారిని ఇష్టపడరు

Relationships: అబ్బాయిల్లో ఈ లక్షణాలు ఉంటే... అమ్మాయిలు వారిని ఇష్టపడరు

Haritha Chappa HT Telugu

13 December 2023, 10:00 IST

    • Relationships: తనకు నచ్చిన అమ్మాయి తమను ఇష్టపడాలని ప్రతి అబ్బాయి కోరుకుంటారు. అయితే కొన్ని రకాల లక్షణాలు అమ్మాయిలు ఇష్టపడరు. అవేంటో తెలుసుకోండి.
ఆడవారికి ఎలాంటి మగవారు నచ్చుతారు?
ఆడవారికి ఎలాంటి మగవారు నచ్చుతారు? (pexels)

ఆడవారికి ఎలాంటి మగవారు నచ్చుతారు?

Relationships: ప్రేమైనా, స్నేహమైనా ఎదుట వ్యక్తి నచ్చితేనే ప్రారంభమవుతుంది. అది కొనసాగాలంటే ఒకరిలో ఒకరికి నచ్చే లక్షణాలు ఉండాలి. అయితే అమ్మాయిలకు, అబ్బాయిల్లో ఉండే కొన్ని రకాల లక్షణాలు నచ్చవు. అవి ఉంటే అమ్మాయిలు వారిని దూరం పెడతారు. కాబట్టి ఎలాంటి లక్షణాలు మగవారిలో ఉండకూడదో తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

కమ్యూనికేషన్ లోపం

అబ్బాయిలు తక్కువగా మాట్లాడతారు. అది నిజమే కానీ, మరీ తక్కువగా మాట్లాడే అబ్బాయిలని అమ్మాయిలు ఇష్టపడరు. అది కమ్యూనికేషన్ లోపంగా మారుతుంది. ఇది భవిష్యత్తులో ఎన్నో సమస్యలకు కారణం అవుతుంది. కమ్యూనికేషన్ లోపం వల్ల అపార్ధాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మగవారు తమ భావాలను వ్యక్తీకరించాలి. అప్పుడే అమ్మాయిలకి ఇష్టం.

గౌరవంగా ఉంటే...

అగౌరపరిచే ప్రవర్తన ఎవరూ ఇష్టపడరు. అమ్మాయిలు కూడా అంతే. చిన్నచూపు చూడడం, ప్రతి విషయాన్ని తిరస్కరించడం వంటివి ఆడవారిలో అయష్టతను పెంచుతాయి. పరస్పరం గౌరవించుకోవడం అనేది అమ్మాయిలకు నచ్చే అంశం. ఇది ఆరోగ్యకరమైన బంధాలకు పునాది వేస్తుంది. ఎదుటివారిని తక్కువగా చూడడం, ప్రతి విషయంలో అసంతృప్తిని చూపించడం వంటివి ఆడవారు ఇష్టపడరు.

తేదీలను మర్చిపోవడం

మగవారు తమ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు, అవి జరిగిన తేదీలను మర్చిపోతూ ఉంటారు. అలా మర్చిపోయిన క్రమంలో తమ ప్రేమ, పుట్టినరోజు, పెళ్లి తేదీలను కూడా మర్చిపోతారు. ఇది ఆడవారికి నచ్చని అంశం. జీవితంలో ముఖ్యమైన రోజులను గుర్తు పెట్టుకోవాలనేది మహిళల అభిప్రాయం. కాబట్టి పుట్టినరోజు, మీరు తొలి కలిసిన రోజు వంటివన్నీ కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. అప్పుడే అమ్మాయిల మనసును గెలుచుకోగలరు.

మనసులో ఉన్నది చెప్పలేకపోతే

మగవారు తాము చెప్పాలనుకున్నది చెప్పడానికి ఇబ్బంది పడుతున్నా, భావోద్వేగాలను వ్యక్తీకరించలేకపోయినా, మహిళలు అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. తక్కువ భావవ్యక్తీకరణ అనేది మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది. ఒక విషయాన్ని అడిగితే దాన్ని నావిగేట్ చేయడానికి ప్రయత్నించే మగవారు కూడా మహిళలకు నచ్చరు.

చురుకుగా ఉండాలి

ఏ విషయంలోనైనా చొరవ తీసుకోకపోవడం, తెలియని విషయంలో కూడా ఉండడం వంటివి ఆడవారికి నచ్చదు. ప్రతి విషయంలో చొరవ తీసుకొని చురుగ్గా ఉంటూ ముందుకు సాగే వారే మహిళలకు నచ్చుతారు. కాబట్టి చురుగ్గా ఉండేందుకు ప్రయత్నించండి.

అసూయకు దూరం

మాటల్లో ఇతర ఇతరుల పట్ల అసూయ చూపించడం, అభద్రతగా ఉండడం అనేది అమ్మాయిల్లో ఇష్టాన్ని చంపేస్తుంది. ఒక నిర్దిష్ట స్థాయి వరకు అభద్రత లేదా అసూయ ఉంటే ఫరవాలేదు. కానీ అధికంగా ఉంటే మాత్రం అది ప్రేమ బంధాన్ని దెబ్బతీస్తుంది. ఆరోగ్యకరమైన భాగస్వామ్యానికి అసూయ, అభద్రతా వంటివి నమ్మకాన్ని కోల్పోలా చేస్తాయి.

సమానత్వం

నేటి కాలంలో మహిళలు సమానత్వాన్ని, భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నారు. పూర్వంలాగా మగవాడు చెప్పినట్టు ఆడవాళ్లు వినాలి అనే అభిప్రాయంతో ఉన్న వారిని స్త్రీలు దూరం పెడతారు. సమానత్వాన్ని ఆదరించే వ్యక్తులని తమ జీవితంలో ఉండేలా చేసుకుంటారు. కాబట్టి పరస్పరం గౌరవిస్తూ, తమతో సమానంగా ఆడవారిని చూసే మగవారికే మహిళల ఓటు.

తదుపరి వ్యాసం