తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Christmas Festival: ప్రతి ఏటా డిసెంబర్ 25నే క్రిస్మస్ ఎందుకు జరుపుకోవాలి?

Christmas festival: ప్రతి ఏటా డిసెంబర్ 25నే క్రిస్మస్ ఎందుకు జరుపుకోవాలి?

Gunti Soundarya HT Telugu

13 December 2023, 14:00 IST

    • Christmas: క్రైస్తవులకి ఎంతో ముఖ్యమైన పండుగ క్రిస్మస్. డిసెంబర్ 25 న ఏటా క్రిస్మస్ జరుపుకుంటారు. అదే రోజు క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి గల కారణం ఏమిటంటే.. 
క్రిస్మస్ పండుగ విశిష్టత తెలిపే పశువుల పాక డెకరేషన్
క్రిస్మస్ పండుగ విశిష్టత తెలిపే పశువుల పాక డెకరేషన్ (AFP)

క్రిస్మస్ పండుగ విశిష్టత తెలిపే పశువుల పాక డెకరేషన్

Christmas: డిసెంబర్ అంటే క్రిస్మస్ నెల. ఏటా డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటారు. శాంతా క్లాజ్ వచ్చి పిల్లలందరీకి బహుమతులు ఇస్తాడని ఎదురుచూస్తారు. క్రిస్మస్ రోజు క్రైస్తవులు అందరూ చర్చికి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేస్తారు.

క్రైస్తవులు ఎంతో ముఖ్యమైన పండుగ ఇది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో క్రిస్మస్ సెలవు రోజు. యేసు క్రీస్తు పుట్టిన పర్వదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. ఆరోజు ప్రభువైన క్రీస్తుని పాటలు పాడుతూ స్తుతిస్తారు. అసలు క్రిస్మస్ డిసెంబర్ 25న ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం,

క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు?

క్రైస్తవుల మత గ్రంథం బైబిల్ ప్రకారం కన్య అయిన మరియ గర్భం లోక రక్షకుడు జన్మించాడు. మానవులను పాపాల నుంచి విముక్తి చేయడం కోసం ప్రభువైన క్రీస్తు మానవుడిగా పుట్టాడు. మరియమ్మకి యోసేపుతో వివాహం నిశ్చయం అవుతుంది. ఒక రోజు మరియకి గాబ్రియేలు అనే దేవ దూత కలలో కనిపిస్తుంది. మరియా నీవు దైవానుగ్రహం పొందావు. మనుష్యులని పాపాల నుంచి విముక్తి పొందటం కోసం ప్రభువైన యేసుక్రీస్తు నీ గర్భం ద్వారా భూమి మీదకు రాబోతున్నాడు. పుట్టే బిడ్డకి యేసు అని పేరు పెట్టు . యేసు అంటే రక్షకుడని అర్థం అని చెప్తుంది.

మరియ గర్భం దాలుస్తుంది. మరియని వివాహం చేసుకోవాలనుకున్న యోసేపుకి ఈ విషయం తెలియడంతో వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకుంటాడు. కానీ గాబ్రియేలు దేవ దూత కలలో దర్శనమిస్తుంది. మేరీని విడిచి పెట్టకు. ఆమె దేవుని వరంతో మరియ గర్భం దాల్చింది. తనని విడిచిపెట్టకు. ఆమె పుట్టిన బిడ్డ దేవుడి బిడ్డ. ప్రజలని పాపాల నుంచి రక్షించడం కోసం మానవుడిగా పుట్టబోతున్నాడు అని చెప్తుంది. దైవ దూత చెప్పిన తర్వాత మేరీని యోసేపు ఆదరిస్తాడు.

యేసు జననం

మరియ గర్భాన పుట్టబోతున్న దేవుడి బిడ్డ పుట్టబోతున్నాడని వార్త అందరికీ తెలుస్తుంది. యేసు వల్ల హేరోదు రాజుకి అపాయం ఉంటుందని కొందరు చెప్తారు. దీంతో హేరోదు రాజు శిశువు గురించి తెలుసుకుని మట్టుపెట్టమని చెప్తాడు. విషయం తెలిసిన మేరీ, యోసేపు ఊరు విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటారు. నిండు గర్భంతో బెత్లెహేం నగారానికి పయనమవుతారు.

అర్థరాత్రి మేరీకి నొప్పులు వస్తాయి. వాళ్ళు ఉండేందుకు ఎక్కడా చోటు దొరకలేదు. చివరికి ఒక సత్రం యజమాని పశువుల పాకలో వారికి ఆశ్రయం ఇస్తాడు. ఆ రోజు డిసెంబర్ అర్థరాత్రి 24. అక్కడే మేరీ యేసుకి జన్మనిస్తుంది. పురిటి బిడ్డని పడుకోబెట్టడానికి స్థలం లేకపోతే పశువుల పాకలోని పశువుల తొట్టిలో ఉంచుతారు. అక్కడకి దగ్గరలో కొందరు గొర్రెల కాపారులకి ఆకాశంలో వెలుగు కనిపిస్తుంది.

వెలుగుని చూసి గొర్రెల కాపారులు భయపడతారు. అప్పుడు దేవ దూత భయపడొద్దు.. మీకు ఒక శుభవార్త చెప్పడం కోసం వచ్చాను. మీకోసం లోకరక్షకుడు జన్మించాడు. ఆయనే మీ అందరికీ ప్రభువు అని చెప్తుంది. యేసుని కనుగొనేందుకు ఆకాశంలో ఉన్న ఒక చుక్కని చూపించి అది మిమ్మల్ని ప్రభువు కుమారుడు దగ్గరకి తీసుకెళ్తుందని చెప్తుంది. దీంతో గొర్రెల కాపారుల వారి శక్తి మేరకు యేసు కోసం బహుమతులు తీసుకొని దేవ దూత చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం వెళతారు. పశువుల పాకలో ఉన్న యేసుని చూసి కొనియాడతారు. అప్పుడు సమయం డిసెంబర్ అర్థరాత్రి. అప్పటి నుంచి డిసెంబర్ 25 వ తేదీన క్రీస్తు జన్మదినంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు.

తదుపరి వ్యాసం