తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Corn And Water : మెుక్కజొన్న తిన్న తర్వాత నీరు తాగకూడదు.. ఎందుకు?

Corn and Water : మెుక్కజొన్న తిన్న తర్వాత నీరు తాగకూడదు.. ఎందుకు?

Anand Sai HT Telugu

29 January 2024, 12:30 IST

    • Corn and Water : కొన్ని రకాల పదార్థాలు తిన్న తర్వాత నీరు తాగకూడదు. ఇది కడుపులో సమస్యలను కలిగిస్తుంది. అలాగే మెుక్కజొన్న తిన్న తర్వాత కూడా నీరు తాగకూడదు. ఎందుకు తెలుసా?
మెుక్కజొన్న
మెుక్కజొన్న

మెుక్కజొన్న

మొక్కజొన్న చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్థం. మొక్కజొన్నను మనం చాలా రకాలుగా తినవచ్చు. కొందరు ఉడకబెట్టి తింటే.. మరికొందరు నిప్పుల్లో కాల్చి తింటారు. నిమ్మకాయ, కారం, ఉప్పు పైన రాసి తింటే ఆ టేస్టే వేరు. మంచి రుచిని ఇస్తుంది. ఆరోగ్యకరమైనది కూడా.

అయితే దీనితో వచ్చిన సమస్య ఏంటంటే.. ఆయుర్వేదం ప్రకారం మెుక్క జొన్న తిన్న తర్వాత నీరు తాగకూడదు. తాగితే వివిధ రకాల కడుపు సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కడుపులో వాతం, కడుపునొప్పి వస్తుందని అంటారు. మెుక్క జొన్న తిన్న తర్వాత చాలా మందికి దాహంగా ఉంటుంది. దీంతో అది తిన్న తర్వాత నీరు తాగుతారు. కానీ ఇలా తాగితే.. అపానవాయువు, తీవ్రమైన కడుపు నొప్పిని ఎదుర్కొంటున్నట్టుగా చాలా మంది చెప్పారు.

మొక్కజొన్న తిన్న తర్వాత నీరు తాగడం జీర్ణక్రియ ప్రక్రియకు చాలా విఘాతం కలిగిస్తుంది. మొక్కజొన్నలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, పిండిపదార్థాలు ఉంటాయి. నీరు తాగడం వల్ల వెంటనే అపానవాయువు ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా అపానవాయువు, ఆమ్లత్వం, తీవ్రమైన కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి.

మొక్కజొన్న తిన్న తర్వాత కడుపు నొప్పి వస్తే, అది మొక్కజొన్న వలన కాదు.. తాగిన నీటి కారణంగా అలా అవుతుంది. అందుకోసమే మొక్కజొన్న తిన్న తర్వాత ఎలాంటి కడుపు సమస్యలు రాకుండా ఉండాలంటే మొక్కజొన్న తిన్న తర్వాత కనీసం 45 నిమిషాల గ్యాప్ తప్పనిసరి.

మొక్కజొన్న ఎలా తినాలి అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా మొక్కజొన్నను నిప్పులో కాల్చి నిమ్మకాయ, మిరప పొడి, ఉప్పును మొక్కజొన్నపై రాసి తినాలి. మొక్కజొన్నను నిమ్మరసంతో కలిపి తింటే జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగుతుంది. వర్షాకాలంలో రోగ నిరోధక శక్తి కాస్త తగ్గుతుంది. మొక్కజొన్నను నిమ్మరసంతో కలిపి తింటే రోగ నిరోధక శక్తి బలపడి వ్యాధుల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు.

మొక్కజొన్న కొన్నా వెంటనే ఉడికించి తినాలి. మొక్కజొన్న పూర్తి ప్రయోజనాలను పొందడానికి, ఇది తాజాగా ఉన్నప్పుడు తినడం ఉత్తమం. చాలా గంటలు వదిలి, ఆపై తింటే, హానికరమైన బ్యాక్టీరియా దానిపై చేరే అవకాశం ఉంది. మెుక్కజొన్నతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వదులుకోవద్దు.

తదుపరి వ్యాసం