తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Loss After Pregnancy : ప్చ్.. డెలివరీ తర్వాత జుట్టు ఎక్కువగా రాలుతుందా?

Hair Loss After Pregnancy : ప్చ్.. డెలివరీ తర్వాత జుట్టు ఎక్కువగా రాలుతుందా?

Anand Sai HT Telugu

28 August 2023, 10:32 IST

    • Hair Loss After Pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో పొడవుగా, ఒత్తుగా ఉన్న జుట్టు బిడ్డ పుట్టిన తర్వాత రాలిపోవడం కనిపిస్తుంది. మీ జుట్టును దువ్వినప్పుడు, దువ్వెనలో చాలా వెంట్రుకలు వస్తాయి. దీంతో ఆందోళన మెుదలవుతుంది. ఇలా ఎందుకు అవుతుంది? పరిష్కారం ఏంటి?
ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు రాలడం
ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు రాలడం

ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు రాలడం

బాలింతలకే కాదు ప్రతి ఒక్కరిలో జుట్టు రాలడం(Hair Loss) సర్వసాధారణం. కానీ గర్భం దాల్చిన తర్వాత హార్మోన్లలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ హార్మోన్లలో మార్పులు జుట్టు పెరుగుదలను(Hair Growth) ప్రేరేపిస్తాయి. అంటే ప్రెగ్నెన్సీ(Pregnancy) హార్మోన్లు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. ప్రసవానంతరం హార్మోన్లు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ఈస్ట్రోజెన్ తగ్గుతుంది. ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో చాలా నెలలుగా తలపై ఉండే వెంట్రుకలు రాలిపోతాయని కూడా నిపుణులు చెబుతున్నారు. వైద్య శాస్త్రంలో దీనిని టెలోజెన్ ఎఫ్లువియం అంటారు.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

డెలివరీ అయిన మూడు నెలల తర్వాత జుట్టు రాలడం మొదలవుతుందని నిపుణులు అంటున్నారు. దువ్వినప్పుడు, స్నానం చేసేటప్పుడు జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. ముందు భాగంలో వెంట్రుకలు ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, తల పైభాగంలో, పక్క వైపులా బట్టతలలాగా అనిపించవచ్చు. కానీ భయపడవద్దు. ప్రసవానంతర జుట్టు రాలడం తాత్కాలికం మాత్రమే.

ప్రెగ్నెన్సీ(Pregnancy) సమయంలో ఒత్తుగా, పొడవుగా ఉండే జుట్టు(Hair) తర్వాత సన్నగా మారవచ్చు. ప్రతి ఒక్కరిలో హార్మోన్ల మార్పులు భిన్నంగా ఉంటాయి. కాబట్టి కొంతమందికి ఎక్కువ లేదా తక్కువ జుట్టు రాలిపోవచ్చు. ఇది సహజమైన ప్రక్రియ. మీ జుట్టు మరింత సన్నబడటం ప్రారంభిస్తే చింతించకండి. కొందరిలో మూడు నెలలు, కొందరిలో ఆరు నెలలు లేదా ఏడాది వరకు ఉంటుంది.

ప్రసవం తర్వాత జుట్టు రాలడాన్ని(Hair Loss) ఆపడం కష్టం. కానీ కొన్ని ప్రయత్నాలతో జుట్టు రాలడాన్ని నియంత్రించవచ్చు. డెలివరీ తర్వాత ప్రోటీన్, ఐరన్ తీసుకోవడం తగ్గించవద్దు. మంచి ఆహారం, పోషకాహారం జుట్టు రాలడాన్ని నియంత్రించడమే కాకుండా జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. పోషకాహారం తీసుకున్నా జుట్టు రాలడం తగ్గకపోతే, జుట్టు రాలడం విపరీతంగా ఉంటే వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే థైరాయిడ్(thyroid) సమస్య, ఇతర ఆరోగ్య సమస్యలు దీనికి కారణం కావచ్చు.

బిడ్డ పుట్టిన తర్వాత జుట్టు రాలడాన్ని చూసి కొందరు నిరుత్సాహపడవచ్చు. కానీ చింతించకండి. వీలైనంత వరకు జుట్టును ఎలా చూసుకోవాలో శ్రద్ధ వహించండి. ప్రసవానంతర జుట్టు రాలడం సమస్య ఎక్కువగా ఉంటే.. సెలూన్ వెళ్లండి. మీకు సరిపోయే హెయిర్‌స్టైల్(Hair Style) కోసం స్టైలిస్ట్‌తో మాట్లాడండి. చిన్న హ్యారీకట్ లేదా మీ ముఖాన్ని మెప్పించే లేయర్డ్ కట్ చేయించండి.

షాంపూ, కండిషనర్లు వంటి జుట్టు ఉత్పత్తులను ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ జుట్టును షాంపూ చేసిన తర్వాత కండీషనర్ లేదా లీవ్-ఇన్ కండీషనర్ ఉపయోగించండి. బట్టతల రూపాన్ని నివారించడానికి సైడ్ హెయిర్‌స్టైల్ చేయండి.

సాధారణంగా, స్ట్రెయిట్ హెయిర్ ఉన్నవారిలో జుట్టు రాలడాన్ని(Hair Loss) ముందుగానే గుర్తించవచ్చు. కానీ ఉంగరాల జుట్టు ఉన్నవారిలో ఇది తెలియదు. వీలైతే జుట్టును సహజంగా కర్ల్ చేయండి. హెడ్‌బ్యాండ్‌లు, స్కార్ఫ్‌లు, హెయిర్‌బ్యాండ్‌లను ధరించడం వల్ల జుట్టు రూపాన్ని మార్చడమే కాకుండా మీ అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇది స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌ని వదిలేసి, మిమ్మల్ని మీరు అందంగా మార్చుకునే మార్గాలను కనుగొనండి. జుట్టు ఆరోగ్యానికి(hair health) మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం. జుట్టు రాలడం గురించి చింతించకండి, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.

తదుపరి వ్యాసం