తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పెళ్లయిన మెుదటి ఏడాది కొంతమంది శృంగారం ఎందుకు చేయరు?

పెళ్లయిన మెుదటి ఏడాది కొంతమంది శృంగారం ఎందుకు చేయరు?

HT Telugu Desk HT Telugu

14 November 2023, 20:00 IST

    • Sexless Reasons : ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. అన్ని జంటలు కలిసి సంతోషంగా జీవిస్తారా? అంటే చెప్పలేం. పెళ్లయిన మొదటి సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైనది. కానీ కొంతమంది మాత్రం సమస్యలు ఎదుర్కొంటారు.
సెక్స్ సమస్యలు
సెక్స్ సమస్యలు

సెక్స్ సమస్యలు

కొంతమంది జంటలకు, మొదటి సంవత్సరం చాలా గుర్తుండిపోతుంది. కొంతమందికి మొదటి సంవత్సరం నిరాశ, చేదు, అసంతృప్తిగా ఉండవచ్చు. మనం అనుకున్నవన్నీ మన జీవితంలో జరగవు. వివాహమైన మొదటి సంవత్సరం మీరు ఆశించినంత మధురంగా లేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Pregnancy Tips : గర్భంతో ఉన్నప్పుడు బొప్పాయి ఎందుకు తినకూడదో అసలైన కారణాలు

Ashwagandha powder: ప్రతిరోజూ అశ్వగంధ చూర్ణాన్ని ఇలా తీసుకోండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలే రావు

Ivy gourd and Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ దొండకాయలు తింటే చాలు, వాటితో ఎన్నో అద్భుత ప్రయోజనాలు

Gongura Chicken Pulao: స్పైసీగా గోంగూర చికెన్ పులావ్, దీన్ని తింటే మామూలుగా ఉండదు, రెసిపీ ఇదిగో

వివాహమైన మొదటి సంవత్సరంలో ప్రతి జంటకు చిన్న చిన్న విభేదాలు ఉండవచ్చు. ఒకరినొకరు తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. కొంతమంది సులభంగా అర్థం చేసుకోగలరు. వివాహ జీవితం మొదటి సంవత్సరం మీరు ఉండే విధానాన్ని బట్టి.. మిగతా జీవితం ఆధారపడి ఉంటుంది.

కానీ సంబంధంలో భావోద్వేగ సాన్నిహిత్యం లేదా సెక్స్ లేనప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? వైవాహిక సంబంధం నెమ్మదిగా సెక్స్‌లెస్‌గా మారుతుంది. మీ మొదటి సంవత్సరం వివాహం సెక్స్‌లెస్‌గా మారడానికి గల కొన్ని కారణాలు ఏంటో చూడండి.

ఏదైనా సంబంధంలో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. సెక్స్ విషయంలో ఓపెన్ కమ్యూనికేషన్ చాలా అవసరం. ఒక జంట తమ కోరికలు, అంచనాలు లేదా ఆందోళనల గురించి ఒకరికొకరు ఓపెన్ కాకపోతే, వారు సెక్స్ చేయడం మానేయవచ్చు. భాగస్వామి సెక్స్ గురించి మాట్లాడటానికి అసౌకర్యంగా భావిస్తే, మరొక భాగస్వామి సైలెంట్ అయిపోవచ్చు. దీని కారణంగా జంటల లైంగిక జీవితం ప్రభావితమవుతుంది.

వైవాహిక జీవితం సెక్స్‌లెస్‌గా మారడానికి ఆరోగ్య సమస్యలు పెద్ద కారణం కావచ్చు. దీర్ఘకాలిక అనారోగ్యాలు, నిరాశ, ఆందోళన, మందుల దుష్ప్రభావాలు కూడా ఒక వ్యక్తి లిబిడో లేదా లైంగిక చర్యలో పాల్గొనే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. మీ భాగస్వామి ఆరోగ్య సమస్యతో ఉంటే.. మీ లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.

ఒత్తిడి, అలసట దంపతుల లైంగిక జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. పని, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు, మరేదైనా ఒత్తిడితో, సెక్స్ చేయలేకపోవచ్చు. జంటలో ఒకరు నిరంతరం ఒత్తిడికి, అలసటతో ఉంటే అది వారి కోరిక, లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

కొంతమంది మహిళలకు పెళ్లయిన కొత్తలో శృంగారం చేయాలంటే భయపడతారు. ఇది చాలా పెద్ద సమస్య. ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. ఒకరినొకరు అర్థం చేసుకుని, శారీరకంగా కలిసేసరికి ఏడాది సమయం కూడా పట్టొచ్చు. దీనివలన చాలా మంది ఇళ్లలో గొడవలు జరుగుతాయి.

పెళ్లయిన తర్వాత భాగస్వామి గురించి ఏదైనా పాత విషయం తెలిస్తే.. వారితో సెక్స్ చేయడం చాలా కష్టం. అవిశ్వాసం అనేది ఏదైనా సంబంధానికి వినాశకరమైనది. ఇది చివరికి మీ వైవాహిక సంబంధంలో సెక్స్ పట్ల ఆసక్తిని కోల్పోయేలా చేస్తుంది.

మీకు, మీ భాగస్వామికి మధ్య ఎమోషనల్ డిస్‌కనెక్ట్ ఉంటే దగ్గరగా ఉండాలనే కోరిక కూడా కలగకపోవచ్చు. విభేదాలు, సమయం ఇవ్వకపోవడం, ప్రశంసలు లేకపోవడం, వల్ల మీరు మీ భాగస్వామి నుండి మానసికంగా డిస్‌కనెక్ట్ అయినట్లు అనిపించవచ్చు.

తదుపరి వ్యాసం